జూన్ 1 నుంచి వారి గ్యాస్ కనెక్షన్లు రద్దు కానున్నాయా? అదనంగా రూ. 300 చెల్లించాలా?

జూన్ 1 నుంచి వారి గ్యాస్ కనెక్షన్లు రద్దు కానున్నాయా? అదనంగా రూ. 300 చెల్లించాలా?

గత కొంతకాలంగా గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి కేవైసీ చేసుకోవాలని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తాజాగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్య సమాచారం అందింది. అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవడం మంచింది.

గత కొంతకాలంగా గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి కేవైసీ చేసుకోవాలని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తాజాగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్య సమాచారం అందింది. అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవడం మంచింది.

ప్రస్తుత కాలంలో వంట గ్యాస్ లేని ఇల్లు అంటూ ఏదీ లేదు. ఎందుకంటే.. పట్టణాలు మొదలుకుని మారుమూల పల్లెల వరకు అందరూ.. ఈ గ్యాస్‌ ను వినియోగిస్తుంటారు. ముఖ‍్యంగా మహిళలైతే  పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ వంట గ్యాస్‌ మీదే ఇంటిల్లపాదికి రకరకాల వంటలు  చేస్తుంటారు. ఇదిలా ఉంటే..  గత కొంతకాలంగా ఈ గ్యాస్  కనెక్షన్‌కు ఉన్నవారికి  కేవైసీ చేసుకోవాలని, గడువు తేదీలో చేయించుకోక పోతే గ్యాస్‌ కనెక్షన్‌  రద్దు అవుతుందనే సమాచారం వినిపిస్తోంది. ఈ సమయంలోనే  తాజాగా ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్య సమాచారం అందింది. అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవడం మంచింది.

గత కొంతకాలంగా గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి కేవైసీ చేసుకోవాలని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ ఇలా పలు ఇంధన కంపెనీలు ఇప్పటికే కస్టమర్లకు సందేశాల్ని పంపిస్తున్నాయి. అంతేకాకుండా.. వీలైనంత త్వరగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. అలాగే కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. దీనికి సంబంధించి పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, ఇప్పటి వరకు కేవైసీ చేసుకోని వారుంటే.. ఇప్పుడు ఆందోళన చెందల్సిన అవరసరం లేదు. ఎందుకంటే..  ఈ కేవైసీ పూర్తి చేయడానికి మే 31 లాస్ట్ డేట్ అని ఎప్పటినుంచో రిపోర్ట్స్ వస్తున్నా అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతానికి ఈ గ్యాస్ సిలిండర్ ఇకేవైసీ కోసం వస్తున్నా వార‍్తలపై ఎలాంటి గడువు లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే సిలిండర్ కస్టమర్ల ఇళ్లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో.. డెలివరీ సిబ్బందే ఇకేవైసీ పూర్తి చేస్తారట. ముఖ్యంగా అందుకు ఆధార్‌ను ధ్రువీకరించుకొని బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం.. LPG కనెక్షన్‌తో ఆధార్ లింక్ చేసుకునేందుకు ఎలాంటి రుసుములు ఉండవు. అంతేకాకుండా.. ఇండియన్ ఆయిల్ యాప్ డౌన్‌లోన్ చేస్తే చాలు.. ఇకేవైసీ ఈజీగా పూర్తి చేయొచ్చు. అయితే ఇండేన్ గ్యాస్ కలిగిన వారు ఈ సదుపాయం పొందొచ్చు. అందుకోసం సంబంధిత గ్యాస్ డీలర్ దగ్గరకు వెళ్లి ఎల్‌పీజీ సిలిండర్ కోసం ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.  ముఖ్యంగా దీని కోసం ఒక ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ పేరు, కస్టమర్ నంబర్ ఇవ్వాలి. దీనితో పాటు భర్త లేదా తండ్రి పేరు ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ అందించాల్సి ఉంటుంది. ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్లు కూడా చిరునామా పత్రాలుగా సమర్పించొచ్చు.

అయితే కేవైసీ ఇస్తే కస్టమర్ సమాచారం మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీని వలన నకిలీ నకిలీ కనెక్షన్లు ఉంటే బయటపడతాయి. అప్పుడు బ్లాక్ మార్కెట్ తగ్గుతుంది. దీంతో ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంటుంది. మరోవైపు నిరుపేదలకు సరైన సమయంలో గ్యాస్ సిలిండర్లు అందుతాయి. ప్రస్తుతం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన వారికి రూ. 300 సబ్సిడీ అందిస్తుంది కేంద్రం. అందుకోసం కేవైసీ చేసుకోవాలి. దీనికి డెడ్‌లైన్ అంటూ ఏం లేదు కానీ కేవైసీ చేసుకోవడం ఉత్తమం. అలా చేయకపోతే కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఈ సబ్సిడీ రాకపోవచ్చు.

Show comments