Low Cost Plots: సిటీ పక్కన 11 లక్షలకే 1 BHK ప్లాట్.. ఇప్పుడు కొంటే ఊహించని లాభాలు!

సిటీ పక్కన 11 లక్షలకే 1 BHK ప్లాట్.. ఇప్పుడు కొంటే ఊహించని లాభాలు!

Low Cost Plots: తక్కువ రేటుకి, మంచి ఏరియాలో ప్లాట్ కొనాలని అనుకుంటే కనుక ఈ ఏరియా మీకు ఉత్తమ ఛాయిస్ గా ఉంది. ఈ ఏరియా ఐటీ హబ్స్ కి, ఇండస్ట్రియల్ జోన్ కి దగ్గరలో ఉంది. సిటీకి ఈజీ కనెక్టివిటీ కూడా ఉంది.

Low Cost Plots: తక్కువ రేటుకి, మంచి ఏరియాలో ప్లాట్ కొనాలని అనుకుంటే కనుక ఈ ఏరియా మీకు ఉత్తమ ఛాయిస్ గా ఉంది. ఈ ఏరియా ఐటీ హబ్స్ కి, ఇండస్ట్రియల్ జోన్ కి దగ్గరలో ఉంది. సిటీకి ఈజీ కనెక్టివిటీ కూడా ఉంది.

చాలా మంది సామాన్యులు, మధ్యతరగతి వ్యక్తులు ఎక్కడో ఒక చోట ఒక మంచి ల్యాండ్ కొనాలని భావిస్తారు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలే వేరు అని తెలిసిన వాళ్ళు కొంచెం కష్టమైనా గానీ సంపాదించిన డబ్బుని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ల్యాండ్ రేట్లు తక్కువగా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది సొంత ఊర్లోనే చేయనవసరం లేదు. చాలా మంది ఇప్పుడు ఒక చోట ఉంటూ కూడా వేరు వేరు చోట్ల ఇన్వెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పోలిస్తే ఏపీలో తక్కువగా ఉన్న మాట వాస్తవమే. కానీ తక్కువగా ఉండడం ఇప్పుడు సామాన్యులకు, మధ్యతరగతి వ్యక్తులకు లాభం చేకూరనుంది. హైదరాబాద్ లో కొనలేకపోతున్నాం అని ఫీలయ్యేవారు ఏపీ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే ఫ్యూచర్ లో ఊహించని లాభాలను పొందవచ్చు. 

వైజాగ్ సబ్ అర్బన్ ప్రాంతంగా:

అలాంటి ఏరియాల్లో ఆనందపురం ఏరియా ఒకటి. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. రెసిడెన్షియల్ గా, కమర్షియల్ గా రియల్ ఎస్టేట్ కి అనుకూలంగా ఉంది ఈ ఏరియా. రెసిడెన్షియల్ ప్లాట్స్ కి ఇది అనువైన ప్రాంతంగా ఉంది. ఇది వైజాగ్ కి పశ్చిమ అంచున ఉన్న కారణంగా ఇది సిటీ సెంటర్, ఐటీ హబ్స్, ఇండస్ట్రియల్ జోన్స్, విద్యాసంస్థలు వంటి వాటికి కనెక్టివిటీ బాగుంది. మంచి రోడ్లు, హైవేలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పైగా ఇక్కడ ఇండ్ల స్థలాల రేట్లు మిడిల్ క్లాస్ వారు భరించగలిగే రేంజ్ లో ఉంటాయి. అనేక స్కూల్స్, మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్, పోస్ట్ ఆఫీస్, పలు దేవాలయాలు ఉన్నాయి. ఇది వైజాగ్ సబ్ అర్బన్ ప్రాంతంగా ఉంది.

ఎయిర్ పోర్ట్ కి దగ్గరగా:

ఇది చెన్నై-శ్రీకాకుళం హైవే మీద ఉంది. నివాసానికి కావాల్సిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వైజాగ్ నుంచి 40 కి.మీ. దూరంలో ఉంది. వైజాగ్ నుంచి ఆనందపురం పట్టణానికి చాలా బస్సులు ఉన్నాయి. విజయనగరం నుంచి 29 కి.మీ. దూరంలో ఉంది. మధురవాడ నుంచి 10 కి.మీ., భీమునిపట్నం నుంచి 12 కి.మీ., భోగాపురం నుంచి 24 కి.మీ. దూరంలో ఉంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తే ఆనందపురం నుంచి ఎయిర్ పోర్ట్ దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం చదరపు అడుగు స్థలం సగటున రూ. 2,200గా ఉంది. అంటే గజం రూ. 19,800 పడుతుంది. 150 గజాల స్థలం కొనాలంటే 30 లక్షలు అవుతుంది.

ఫ్యూచర్ లో మంచి లాభాలు:

1 బీహెచ్కే ఇంటికి సరిపడా స్థలానికి 11 లక్షలు అవుతుంది. సింపుల్ గా చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. 2019లో గజం సగటున రూ. 13,950 ఉండేది. ఐదేళ్ళలో దాదాపు 6 వేలు పెరిగింది. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక ఫ్యూచర్ లో మంచి లాభాలను పొందవచ్చు. ఎందుకంటే వైజాగ్ లోని ఆనందపురం ఏరియా సహా చుట్టుపక్కల ఏరియాలు అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. పరిశ్రమలు, ఐటీ హబ్స్ కి దగ్గరగా ఉండడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Show comments