Love Me If You Dare Me OTT: సడెన్ గా OTT లోకి లవ్ మీ ఇఫ్ యూ డేర్ మీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

సడెన్ గా OTT లోకి లవ్ మీ ఇఫ్ యూ డేర్ మీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Love Me If You Dare Me OTT: ఈ వారం ఓటీటీ లోకి వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి సినిమాలు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న క్రమంలో.. సైలెంట్ గా మరో సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది .

Love Me If You Dare Me OTT: ఈ వారం ఓటీటీ లోకి వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి సినిమాలు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న క్రమంలో.. సైలెంట్ గా మరో సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది .

ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా కొద్దీ రోజులకే సినిమాలు.. ఓటీటీ లోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా రోజునే.. ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కంఫర్మ్ అవుతున్న సంగతి తెల్సిందే. అయితే స్ట్రీమింగ్ డేట్స్ మాత్రం.. థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని అనౌన్స్ చేస్తూ ఉంటారు మేకర్స్. ఈ క్రమంలో.. కొన్ని సినిమాలు ఎటువంటి అనౌన్స్ మెంట్ లేకుండా సైలెంట్ స్ట్రీమింగ్ అయిపోతూ.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించిన “లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ” మూవీ కూడా ఎటువంటి అనౌన్స్ మెంట్ లేకుండా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

బేబీ మూవీ తర్వాత వైష్ణవి చైతన్య పై అందరికి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దీనితో ఆమె నెక్ట్ మూవీ ఎలా ఉంటుందా అని అందరు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే.. మే 25 న వైష్ణవి చైతన్య , ఆశిష్ జంటగా నటించిన “లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ” అనే సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ లో ఈ సినిమా అందరిని ఆకట్టుకున్నా సరే.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు రెండవ పార్ట్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్ . మరి అది ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఎటువంటి అనౌన్స్ మెంట్ లేకుండా జూన్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే .. ఆశిష్ కు దేవుడు, దెయ్యాలపై అంతగా నమ్మకం ఉండదు. ఎవరైనా దెయ్యాలు ఉన్నాయని చెప్తే.. అసలు అక్కడ దెయ్యాలే లేవని సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ ఉంటాడు. దానికి సంబంధిచిన వీడియోలు అన్ని కూడా యూట్యూబ్ లో పెడుతూ ఉంటాడు. ఈ విషయంలో ఆశిష్ తమ్ముడు ప్రతాప్ అతనికి సహాయపడుతుంటాడు. ఈ క్రమంలో ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ వైష్ణవి దివ్యవతి అనే దెయ్యం గురించి.. ఆశిష్ కు చెప్తుంది. తెలంగాణ-కర్ణాటక బోర్డర్ లో ఓ ఊరిలో.. పాడుపడిపోయిన బిల్డింగ్ లో దెయ్యం తిరుగుతుందని.. ఆమె గురించి ఎవరైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే.. ఆమె చంపేస్తుందని చెప్తుంది. దీనితో ఆశిష్ ఆ విషయాన్నీ ఛాలెంజింగ్ గా తీసుకుని.. ఎలాగైనా ఆ దెయ్యాన్ని ప్రేమలో పడేసి అసలు విషయం తెలుసుకోవాలని అనుకుంటాడు. అసలు దివ్యవతి ఎవరు ! ఆమె కథ ఏంటి ! ఆశిష్ ఆమెను ఎందుకు ప్రేమలో పడేయాలని అనుకుంటాడు! ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో ఈ సినిమాను చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments