Land Rates Increased: HYDలో ప్రధాన ఏరియాల్లో స్థలాల ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయంటే?

HYDలో ప్రధాన ఏరియాల్లో స్థలాల ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయంటే?

Land Rates Increased: హైదరాబాద్ లో కొన్ని ఏరియాల్లో ల్యాండ్ రేట్లు తగ్గగా.. మరికొన్ని చోట్ల మాత్రం పెరిగాయి. కేవలం రెండు నెలల్లోనే రేట్లు పెరిగాయి. హైదరాబాద్ సిటీలో అలానే నగర శివారు ప్రాంతాల్లో స్థలాల రేట్లు ఎక్కడెక్కడ పెరిగాయో ఇప్పుడు చూద్దాం.

Land Rates Increased: హైదరాబాద్ లో కొన్ని ఏరియాల్లో ల్యాండ్ రేట్లు తగ్గగా.. మరికొన్ని చోట్ల మాత్రం పెరిగాయి. కేవలం రెండు నెలల్లోనే రేట్లు పెరిగాయి. హైదరాబాద్ సిటీలో అలానే నగర శివారు ప్రాంతాల్లో స్థలాల రేట్లు ఎక్కడెక్కడ పెరిగాయో ఇప్పుడు చూద్దాం.

మొన్నా మధ్య తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడడం, లోక్ సభ ఎన్నికల ఫలితాలు రావడం వంటివి రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యిందని అన్నారు. కానీ ఊహించని విధంగా హైదరాబాద్ లో ప్రాపర్టీ ధరలు పెరిగాయి. కొన్ని ఏరియాలు మినహాయిస్తే మిగతా ఏరియాల్లో నగరంలోని ప్రధాన ఏరియాల్లో ధరలు ఎలా ఉన్నాయి? నగరు శివారు ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయి? ఈ 2 నెలల్లో స్థలాల రేట్లు ఎంత మేర పెరిగాయి? అనే పూర్తి వివరాలు మీ కోసం. 

ముందుగా హైదరాబాద్ ఏరియాలో చూసుకుంటే కూకట్ పల్లిలో గతంలో అంటే రెండు నెలల ముందు వరకూ చదరపు అడుగు స్థలం 11,350 రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం 14,150 రూపాయలుగా ఉంది. అంటే గజం లక్ష 27 వేలు పైనే ఉంది. గాజులరామారంలో అయితే గతంలో చదరపు అడుగు స్థలం 6,950 రూపాయలు ఉండేది. ఇప్పుడు 8,350 రూపాయలకు పెరిగింది. బాచుపల్లిలో గతంలో 6,600 రూపాయలు ఉన్న చదరపు అడుగు స్థలం ఇప్పుడు 6,650 రూపాయలకు పెరిగింది. మియాపూర్ లో చదరపు అడుగు స్థలం ధర 7,450 రూపాయల నుంచి 8,350 రూపాయలకు పెరిగింది. కొంపల్లిలో చదరపు అడుగు స్థలం 3,900గా ఉండేది. ఇప్పుడు  7,800 రూపాయలకు పెరిగింది.

బండ్లగూడ జాగీర్ లో 7,800 నుంచి 8,100కి పెరిగింది. ఇస్నాపూర్ లో 3 వేలుగా ఉన్న చదరపు అడుగు స్థలం 3,800 రూపాయలకు పెరిగింది. అమీన్ పురలో 5,950 రూపాయల నుంచి నుంచి 7,200 రూపాయలకు పెరిగింది. ఘట్కేసర్ లో 1450 రూపాయలుగా ఉన్న స్థలం ధర 1550 రూపాయలకు పెరిగింది. పీర్జాదిగూడలో 6,100 నుంచి 6,300, శ్రీశైలం హైవేలో 1300 నుంచి 1450 రూపాయలకు పెరిగింది. ఆదిభట్లలో 1700 నుంచి 2,150కి, షాద్ నగర్ లో 1550 నుంచి 1800 రూపాయలకు పెరిగింది. నందిగామలో 2,950 నుంచి 3,150కి పెరగ్గా.. తిమ్మాపూర్ లో  2,450 నుంచి 2,900కి పెరిగింది.

ఇబ్రహీంపట్నంలో 1400 నుంచి 1600కి పెరగ్గా.. దుండిగల్ లో 3,650 నుంచి 3,900కి పెరిగింది. చేవెళ్లలో స్థలం ధరలు 1200 నుంచి 1550కి పెరిగాయి. కొంగర కలన్ లో 2800 నుంచి 3 వేలకి, శంకరపల్లిలో 1900 నుంచి 2,350 రూపాయలకు పెరిగింది. కొండకల్ లో 3,900 నుంచి 4 వేలకు, బడంగ్ పేట్ లో 4,200 నుంచి 4,350కి, చౌటుప్పల్ లో 1200 నుంచి 1450 రూపాయలకు పెరిగింది. ఇవే ఏరియాల వారీగా ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో, శివారు ప్రాంతాల్లో పెరిగిన స్థలాల ధరలు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Show comments