ఉద్యోగులను ఇంటికి పంపిన Paytm.. గుక్క పెట్టి ఏడ్చిన ఎంప్లాయిస్

ఉద్యోగులను ఇంటికి పంపిన Paytm.. గుక్క పెట్టి ఏడ్చిన ఎంప్లాయిస్

ఇటీవల కాలంలో ఉద్యోగాలను కోల్పోతున్నారు పలువురు. రెసిషన్ పీరియడ్ కావడంతో చాలా మంది టెకీల జాబ్స్ పొగొట్టుకుని నడి రోడ్డు మీదకు వచ్చారు. ఇప్పుడు మరో సంస్థ కూడా తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది.

ఇటీవల కాలంలో ఉద్యోగాలను కోల్పోతున్నారు పలువురు. రెసిషన్ పీరియడ్ కావడంతో చాలా మంది టెకీల జాబ్స్ పొగొట్టుకుని నడి రోడ్డు మీదకు వచ్చారు. ఇప్పుడు మరో సంస్థ కూడా తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది.

ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. రెసిషన్ పేరు చెప్పి ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో లే ఆఫ్స్‌కు అత్యధికంగా బాధితులవుతున్నారు టెకీలు. చెప్పాపెట్టకుండా ఉద్యోగాలను తీసేస్తున్నాయి కొన్ని సంస్థలు. అంతేకాదు..ప్రమోషన్ లెటర్ అందుకుని కొన్ని గంటలు కూడా గడవకుండానే.. డిమోషన్ స్లిప్‌ను అదే చేతితో తీసుకుంటున్నారు. దిగ్గజ సంస్థలు కూడా తమ ఎంప్లాయిస్‌ను తొలగిస్తున్నాయి. దీంతో ఎంతో మంది ఉద్యోగులు జీవితాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పుడు మరో సంస్థ ఉద్యోగులకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చింది. ఇంతకు ఆ సంస్థ ఏంటంటే పేటీయం.

ఉద్యోగులకు భారీ షాకిచ్చింది పేటీయం సంస్థ. ఎలాంటి నోటీసు పీరియడ్ ఇవ్వకుండా రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోండని చెప్పింది. దీంతో ఎంప్లాయిస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. ఈ నిర్ణయానికి షాక్ అవ్వడంతో పాటు.. తమ పరిస్థితి ఏంటో తెలియక గుక్కపెట్టి ఏడ్చారు. తక్కువ జీతానికి, హోదా తగ్గించుకుని పని చేస్తామని చెప్పినా కూడా సంస్థ స్వచ్చంద రాజీనామా చేయాలని యాజమాన్యం చెబుతుందట. పేటీయం బ్యాంక్, వాలెట్ వ్యాపారానికి ముగింపు పలకాలని RBI తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కంపెనీని వీడాలంటూ ఉద్యోగులకు చెబుతుంది పేటీఎం సంస్థ. మీకు రావాల్సిన బకాయిలు అన్నీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

పేటీఎం బ్యాంక్స్‌పై ఇండియాలో ఆర్బీఐ బ్యాంక్ ఆంక్షలు విధించడంతో కంపెనీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.550 కోట్ల నష్టం వచ్చిందని ఆ కంపెనీ పేర్కొంది. దీంతో ఎంప్లాయిస్ తీసివేయడమే సరైన చర్యగా భావించింది. ఉద్యోగులను తీసివేయడమే కాదు.. ఆఫర్ లెటర్ ఇచ్చిన వారిని కూడా వెనక్కు పంపిస్తోంది. అలాగే ఇచ్చిన బోనస్‌లు కూడా తిరిగి ఇచ్చేయమని కంపెనీ ఉద్యోగులకు చెబుతుంది. గత ఆరు నెలల కాలంలో పేటీఎంలో విపరీతంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. దీంతో తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు. అందుకు తగ్గట్లుగానే తమ ఎంప్లాయిస్‌ ఇంటికి పంపుతోంది సదరు సంస్థ. పెరుగుతున్న నష్టాలను పూడ్చుకునేందుకు ఈ దారి పట్టింది. తర్వలో సుమారు 5,000 నుంచి 6,300 మందిని తొలగించడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులకు తగ్గించడం ద్వారా రూ. 400-500 కోట్లను ఆదా చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది

Show comments