OTT Movie Suggestions: OTTలోనే బెస్ట్ మలయాళం మూవీ.. నలుగురు అన్నదమ్ములు కలిసి...

OTTలోనే బెస్ట్ మలయాళం మూవీ.. నలుగురు అన్నదమ్ములు కలిసి…

ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటిన మూవీల్లో ఒకటి మంజుమ్మల్ బాయ్స్. ఇందులో హీరోలుగా నటించారు సౌబిన్ సాహీర్, శ్రీనాథ్ బాసిల్. ఈ ఇద్దరు గతంలో ఓ మూవీ యాక్ట్ చేయగా.. అదీ కూడా సెన్సెషనల్ హిట్ కొట్టింది. ఆ సినిమా ఏంటంటే..?

ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటిన మూవీల్లో ఒకటి మంజుమ్మల్ బాయ్స్. ఇందులో హీరోలుగా నటించారు సౌబిన్ సాహీర్, శ్రీనాథ్ బాసిల్. ఈ ఇద్దరు గతంలో ఓ మూవీ యాక్ట్ చేయగా.. అదీ కూడా సెన్సెషనల్ హిట్ కొట్టింది. ఆ సినిమా ఏంటంటే..?

దక్షిణాది ఇండస్ట్రీలో మలయాళ చిత్రాల తీరు వేరు. రెగ్యులర్ ఫార్మాట్‌కు దూరంగా సినిమాలు తెరకెక్కుతుంటాయి. భారీ లెవల్లో యాక్షన్ సీక్వెన్స్, రిచ్ లోకేషన్లలో షూటింగ్, విదేశాల్లో పాటలు, డ్యాన్సులు ఉండవు. హీరోకు ఓవర్ ఎలివేషన్స్ అసలే ఉండవు. చిన్న లైన్ తీసుకుని సినిమాను నడిపించేస్తుంటారు. న్యాచురాలిటీకి దగ్గరగా మూవీస్ చేస్తుండటంతో.. కేవలం మలయాళ ప్రేక్షకులు మాత్రమే కాదు.. టాలీవుడ్ సినీ లవర్స్ కూడా మాలీవుడ్ చిత్రాలపై మనస్సు పారేసుకుంటున్నారు. భాష అర్థం కాకపోయినా.. భావాన్ని పసిగట్టి మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో రిలీజైన వెంటనే.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాగే గతంలో సందడి చేసిన కొన్ని ఫీల్ గుడ్ మూవీస్ మిస్ అవుతుంటారు.

అలాంటి ఓ సినిమా ఈ వారం మీ ముందుకు తీసుకు వస్తున్నాం.. వీలున్నప్పడు చూసి ఎంజాయ్ చేయండి. ఇటీవల మలయాళ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. రూ. 20 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. రూ. 250 కోట్లు వచ్చి చేరింది. ఈ సినిమాలో హీరోలుగా నటించారు. సౌబిన్ సాహీర్, శ్రీనాథ్ బాసిల్. గతంలో ఈ ఇద్దరు నటించిన ఓ ఫీల్ గుడ్ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. అదే కుంబళంగి నైట్స్. 2019లో వచ్చిన ఈ మూవీలో పహాద్ ఫాజిల్ నెగిటివ్ రోల్ ప్లే చేశాడు. పహాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండస్ బ్యానర్ పై పహాద్, నజ్రియా, దిలీష్ పోతన్ నిర్మించారు. రూ. 6.5 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. రూ. 40 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమా అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

ఇక కథ విషయానికి వస్తే.. నలుగురు అన్నాదమ్ములు. సాజి, బోనీ, బాబీ, ఫ్రాంకీ సోదరులు కుంబళంగి అనే గ్రామంలో ఓ చిన్న ఇంట్లో ఉంటారు. సాజీ తండ్రి బోనీని తల్లిని వివాహం చేసుకోవడంతో వారికి పుడతారు బాబీ, ప్రాంకీలు. తల్లిదండ్రులు ఉండరు. అందుకే వీరి మధ్య సఖ్యత ఉండదు. ఎవరితో ఎవరు మాట్లాడుకోరు. వీరిలో నాల్గొవ వాడు ఫ్రాంకీ వీరందరితో కాస్తో కూస్తో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో తీరు. సాజీ పని పాట చేయకుండా.. నిత్యం తాగుతుంటాడు. బోనీ మూగవాడు. బాబీ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. చిన్నప్పడు స్నేహితురాల్ని లవ్ చేస్తాడు. వీరి ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు ఆమె బావ. మరీ బాబీ లవ్ స్టోరీ కోసం ముగ్గురు అన్నాదమ్ములు ఏం చేశారు. బద్ధ శత్రువులుగా ఉండే బ్రదర్స్ ఎలా కలిపోయారు చూడాలనుకుంటే.. అమెజాన్ ప్రైంలో చూసేయొచ్చు. ఈ మూవీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments