వీడియో: ఆ అబ్బాయి చాలా అమాయకుడు.. తనని మిస్‌ అవుతున్నాను: విజయ్‌ సేతుపతి

వీడియో: ఆ అబ్బాయి చాలా అమాయకుడు.. తనని మిస్‌ అవుతున్నాను: విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నేడు మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ హీరో సుహాస్ తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో విజయ్ కొన్ని ఎమోషనల్ విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి.

Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నేడు మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ హీరో సుహాస్ తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో విజయ్ కొన్ని ఎమోషనల్ విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి.

మ‌క్క‌ల్ సెల్వ‌న్ ‘విజయ్ సేతుపతి’.. ఈ పేరు ప్రేక్షకులు అందరికి సుపరిచితమే. ఎందుకంటే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. అంతేకాకుండా.. ఒక హీరో అనే గర్వం, స్టార్ స్టేటస్ ఏమీ లేని ఒక సదాసీదా నటుల్లో ఈయన కూడా ఒకరు. ముఖ్యంగా విజయ్ సేతుపతి ఇండస్ట్రీలో హీరోలతో కానీ, ఆయన అభిమానులతో కానీ, చాలా అప్యాయంగా దగ్గక తీసుకుంటూ కూల్ గా మాట్లాడుతుంటారు. ఇక ఈయన మంచితనం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ సేతుపతి ‘మహారాజ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా, ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదలై మంచి సక్సేస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ హీరో సుహాస్ తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో విజయ్ కొన్ని ఎమోషనల్ విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నేడు ‘మహారాజ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యాక్ష‌న్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి నితిల‌న్ సామినాథ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇకపోతే ఇందులో మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, అనురాగ్ క‌శ్య‌ప్ కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే ఈ మూవీ థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విజయ్ సేతుపతి టాలీవుడ్ హీరో సుహాస్ తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో విజయ్ కొన్ని ఎమోషనల్ విషయాలను కామెంట్స్ పంచుకున్నారు. ఇక విజయ్ చెప్పిన మాటలకి నెటిజన్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంతకి అందరికి అంతలా కనెక్ట్ అయిన విజయ్ సేతుపతి మాటలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా.

తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇంటర్వ్యూలో సుహాస్ ‘ఇప్పుడు ఈ క్షణం మీరు ఎవరిని మిస్ అవుతున్నారు సార్’ అని విజయ్ సేతుపతికి ప్రశ్నించారు. ఇక ప్రశ్నకి విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ”నన్ను నేను మిస్ అవుతున్నా. ఎందుకంటే.. అప్పటిలో ఓ కుర్రాడు ఉండేవాడు. వాడు చాలా అమాయకుడు. అసలు ఏదైనా సాధించాలనే కలలు కూడా ఉండేవి కాదు. కనీసం లైఫ్ లో అసలు ఏం సాధించాలో క్లారిటీ కూడా లేదు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ కాలేజీలో చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ ఏంటి అనేది కూడా ఆ అబ్బాయికి తెలిదు. అలాగే ఫ్రెండ్స్ అందరూ అది సెకండ్ ఇయర్ సిలబస్ అని చెబితే నాకు తెలియదు అనే సమాధానం ఇచ్చేవాడు. ఇలా చదువు, ఆటలు ఎందులోనూ తోపు కాదు. కనీసం కాలేజీలో అమ్మాయిలతో కూడా మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే తనకి చాలా సిగ్గు.

కానీ, లైఫ్ లో ఏదో పెద్దగా సాధించాలనే కోరిక ఉండేది. కానీ, అది ఏంటీ, ఎలా అని తెలిసేది కాదు. కేవలం తన పేదరికం నుంచి బయటపడాలి అని అనుకునేవాడు ఆ అబ్బాయి. కానీ, ఆ అబ్బాయి ఇప్పుడు లేడు. వాడు చాలా క్యూట్.. వాడినే మిస్ అవుతున్నా. ఆ నన్నే నేను ఇప్పుడు మిస్ అవుతున్నాను” అంటూ విజయ్ సేతుపతి చాలాఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్, అభిమానులు ఒక మధ్యతరగతి కుర్రాడి మాటాలే మీ నోటి నుంచి వచ్చాయి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మరి, విజయ్ సేతుపతి చేసిన ఎమోషనల్ కామెంట్స్ పై మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments