ఆ విషయం తెలిసిన ఖుష్బు.. నన్ను మరో పెళ్లి చేసుకోమని చెప్పింది - సుందర్ సి

ఆ విషయం తెలిసిన ఖుష్బు.. నన్ను మరో పెళ్లి చేసుకోమని చెప్పింది – సుందర్ సి

తమిళ నటుడు సుందర్ సి తాజాగా అరణ్మనై 4 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఆ సినిమా ఈరోజు నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుందర్ వరుస మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుందర్ తన భార్య తనని వేరే పెళ్లి చేసుకొమని చెప్పిదంటూ ఆమె గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తమిళ నటుడు సుందర్ సి తాజాగా అరణ్మనై 4 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఆ సినిమా ఈరోజు నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుందర్ వరుస మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుందర్ తన భార్య తనని వేరే పెళ్లి చేసుకొమని చెప్పిదంటూ ఆమె గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కోలీవుడ్ నటుడు, దర్శకుడు సుందర్ సి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయలసిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఈయన సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమై క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటి వరకు 30 పైగా సినిమాలను తెరకెక్కించారు. అంతేకాకుండా.. ఈయనహీరోగా కూడా పలు సినిమాల్లో నటించాడు. అయితే ఎక్కువ శాతం ఈయన హారర్ జోనర్ లో కు సంబంధించిన సినిమాలనే రూపొందించి వాటిలో హీరోగా నటిస్తుంటాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ‘అరణ్మనై- 3’ కి సీక్వెల్ గా ‘అరణ్మనై -4’ ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీనినే తెలుగులో ‘బాక్’ గా అనే టైటిల్ తో విడుదల చేశారు. కాగా, ఈ సినిమాలో తమన్నా భాటియ, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ఈరోజే థయేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా.. సుందర్ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుందర్ తన భార్య ఖుష్బు గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఆ వివరాళ్లోకి వెళ్తే..

తమిళ నటుడు సుందర్ సి తాజాగా అరణ్మనై 4 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఆ సినిమా ఈరోజు నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సుందర్ వరుస మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుందర్ తన భార్య గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా,అందులో తన భార్య ఖుష్బుకు పిల్లలు పుట్టరనే విషయం తెలియడంతో తాను తీవ్ర భావోద్వేగానికి గురైందని వెల్లడించారు. ఈ సందర్భంగా సుందర్ సి మాట్లాడుతూ..ఇప్పుడు నేను చెప్పుకొస్తుంది మా పెళ్లికి ముందు జరిగింది. కాగా, అప్పుడు ఖుష్బు అనారోగ్యంకు గురైంది. ఆ సమయంలో తనకు పిల్లలు పుట్టరని ఒక వైద్యుడు చెప్పాడు. దీంతో ఆమె ఎంతగానో కుమిలిపోయింది. అలాగే నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఏడుస్తూ ఖుష్బు చెప్పింది. కానీ, నేను తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఇక నా జీవితంలో సంతానం లేకపోయినా సరే తననే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాను. కానీ, అప్పుడు ఆ దేవుడు మామ్మల్ని మరోలా దీవించాడు.ప్రస్తుతం మాకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారంటూ సుందర్ చెప్పుకొచ్చారు.

ఇక సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై- 4 తెలుగులో బాక్ పేరుతో విడుదల  అయింది. ఇక ఈ చిత్రం గతనెల ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. మే3వ తేదీకి వాయిదా పడింది. కాగా, ఈ చిత్రానికి ఖుష్బు నిర్మాతగా వహించారు. అలాగే ఈ చిత్రంలో యోగి బాబు, వీటీవి గణేష్, ఢిల్లీ గణేష్, కోవై సరళ కూడా నటించారు. అయితే ఈ సినిమా ఫ్రాంచైజీలో మొదటి చిత్రం 2014లో విడుదల కాగా, 2016లో పార్ట్‌-2 రిలీజైంది. 2021లో విడుదలైన మూడవ భాగం విడుదలైంది. ఇప్పుడు అరణ్మనై- 4 గా ఈరోజు థియేటర్లలో సందడి చేయనుంది. మరి, దర్శకుడు సుందర్ తన భార్య గురించి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments