KKR Owner Shah Rukh Khan Hospitalized: SRH vs KKR మ్యాచ్ తర్వాత ఆస్పత్రిలో చేరిన షారుఖ్.. ఏమైందంటే..?

SRH vs KKR మ్యాచ్ తర్వాత ఆస్పత్రిలో చేరిన షారుఖ్.. ఏమైందంటే..?

గత కొన్ని సీజన్లుగా అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది కోల్​కతా నైట్ రైడర్స్. అయితే ఈసారి మాత్రం అదిరిపోయే ఆటతీరుతో ఏకంగా ఫైనల్స్​కు చేరుకుంది.

గత కొన్ని సీజన్లుగా అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది కోల్​కతా నైట్ రైడర్స్. అయితే ఈసారి మాత్రం అదిరిపోయే ఆటతీరుతో ఏకంగా ఫైనల్స్​కు చేరుకుంది.

గత కొన్ని సీజన్లుగా అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది కోల్​కతా నైట్ రైడర్స్. అయితే ఈసారి మాత్రం అదిరిపోయే ఆటతీరుతో ఏకంగా ఫైనల్స్​కు చేరుకుంది. గ్రూప్ స్టేజ్​లో వరుస విజయాలతో బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్లింది కేకేఆర్. అదే జోరును ప్లేఆఫ్స్​లోనూ ప్రదర్శించింది. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తమ టీమ్ నెగ్గడంతో కేకేఆర్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా సక్సెస్​ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరారని తెలుస్తోంది.

ఎస్​ఆర్​హెచ్-కేకేఆర్ మ్యాచ్ తర్వాత అహ్మదాబాద్​లోని కేడీ హాస్పిటల్​లో షారుఖ్ అడ్మిట్ అయ్యారని సమాచారం. నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్​కతా మ్యాచ్ చూసేందుకు వచ్చిన కింగ్ ఖాన్​కు వడదెబ్బ తగిలిందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా అహ్మదాబాద్​లో వడగాల్పులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతోనే బాలీవుడ్ సూపర్​స్టార్ అస్వస్థతకు లోనయ్యారని అంటున్నారు. అయితే కింగ్ ఖాన్ ఆరోగ్యం ఎలా ఉందనే దానిపై ఇంకా ఎలాంటి అప్​డేట్ బయటకు రాలేదు. ఇక, ఫైనల్స్​కు వెళ్లిన కేకేఆర్.. క్వాలిఫయర్-2లో నెగ్గిన టీమ్​తో ఛాంపియన్​షిప్ కోసం తలపడనుంది.

Show comments