iDreamPost
android-app
ios-app

యాదాద్రి భువనగిరి జిల్లాలో కిడ్నాప్ కలకలం.. కత్తితో బెదిరిస్తూ..

  • Published Mar 20, 2024 | 9:26 PM Updated Updated Mar 20, 2024 | 9:26 PM

Kidnapping in Motkur: ఈ మద్య కొంతమంది డబ్బు కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. దొంగతనాలు, చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

Kidnapping in Motkur: ఈ మద్య కొంతమంది డబ్బు కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. దొంగతనాలు, చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో కిడ్నాప్ కలకలం.. కత్తితో బెదిరిస్తూ..

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్, పిల్లల్ని ఎత్తుకువెళ్లే గ్యాంగ్ లు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నగరంలో రెండు రోజుల క్రితం చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోయారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ స్కూల్ లో చొరబడి చోరీకి పాల్పపడ్డారు. గత నెల నిజామాబాద్ లో ఓ బాలుడిని ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కొంతమంది ముఠాగా ఏర్పడి తెలంగాణ వ్యాప్తంగా చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వేరే రాష్ట్రాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఎత్తుకు వెళ్లడానికి కిడ్నాపర్లు మత్తు చాక్లెట్లు వాడుతున్నట్లు అనుమానిస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా కిడ్నాపర్ కలకలం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే..

మోత్కూర్ మండలం అనాజి‌పురం గ్రామంలో ఓ కిడ్నాపర్ పిల్లలను ఎత్తుకు వెళ్తున్నాడన్న వార్త దావానంలా వ్యాపించింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా అనాజిపురం గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఓ వ్యక్తి గ్రామస్థులకు కనిపించాడు. తమ గ్రామంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడని భావించారు గ్రామస్థులు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తిని గ్రామస్థులు వెంబడించడంతో భయంతో పారిపోతూ జెడ్పీటీసీ గోరుపల్లి శారత సంతోష్ రెడ్డి గెస్ట్ హౌజ్ లోకి దూరాడు. అప్పటికే గ్రామస్థులు ఆ గెస్ట్ హౌజ్ చుట్టుముట్టారు. దీంతో కిడ్నాపర్ గా భావిస్తున్న వ్యక్తి చేతిలో కత్తి పట్టుకొని హల్ చల్ చేశాడు.

కిడ్నాపర్ కలకలం సృష్టిస్తున్నాడన్న వార్త దావానంలా వ్యాపించడంతో మీడియా కూడా అక్కడికి చేరుకుంది. గెస్ట్ హౌజ్ లో వ్యక్తి గ్రామస్థులను చూసి వారిపై తిరగబడ్డాడు. కొద్ది సేపు పార, కర్ర, చెట్లు కట్ చేసే కట్టర్ తీసుకొని గ్రామస్థులపైకి దూసుకు వెళ్లాడు. గ్రామస్థులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కిడ్నాపర్ పోలీసుపై కూడా తిరగబడ్డాడు. అంతలోనే పోలీసులు చాకచక్యంగా లోపలికి ప్రవేశించి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి కిడ్నాప్ చేయడానికే వచ్చాడా..? మరే ఇతర కారణం ఉందా? అని పోలీసులు ఎంక్వేయిరీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.