Darshan: తప్పించుకునే ఛాన్స్ ఉన్నా తప్పించుకోని రేణుకస్వామి! విచారణలో మౌనంగా ఉన్న దర్శన్..

Darshan: తప్పించుకునే ఛాన్స్ ఉన్నా తప్పించుకోని రేణుకస్వామి! విచారణలో మౌనంగా ఉన్న దర్శన్..

కన్నడ నటుడు దర్శన్.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసు.. ఇండస్ట్రీ వర్గాలలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు విషయంలో మరికొన్ని సంచలన విషయాలు బయట పడ్డాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

కన్నడ నటుడు దర్శన్.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసు.. ఇండస్ట్రీ వర్గాలలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు విషయంలో మరికొన్ని సంచలన విషయాలు బయట పడ్డాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

కన్నడ ప్రముఖ నటుడు దర్శన్.. రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులు.. ఇప్పటికే పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ కూడా అరెస్ట్ అయినా విషయం కూడా తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాము. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన సమగ్ర విచారణ జరుగుతుంది. ఈ కేసులు అరెస్ట్ అయినా మిగిలిన నిందితులు పోలీసులు అడిగే ప్రశ్నలకు.. డైరెక్ట్ గానే ఆన్సర్ చేస్తున్నా కానీ.. దర్శన్ మాత్రం సరైన సమాధానం ఇవ్వకుండా.. చెప్పిందే చెబుతున్నారని తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

విచారణ సమయంలో బయటకు వచ్చిన వివరాల ప్రకారం..రేణుకస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని.. బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలని అనుకున్నామని.. దెబ్బలు తట్టుకోలేక రేణుకస్వామి చనిపోయారని నిందితులు చెబుతున్నారు. ఇదిలా కొనసాగుతుండగా.. పగటి పూట మీడియా, జనాల వలన సరిగా ఇన్వెస్టిగేషన్ జరగదని భావించిన పోలీసులు.. చిత్ర దుర్గ్ లో స్పాట్ మహాజర్ నిర్వహించారు. నిందితులలో ఒకడైన రఘును తీసుకువచ్చి .. రేణుక స్వామిని కిడ్నప్ చేసిన స్థలాన్ని.. ఆ ఇన్సిడెంట్ కు సంబంధం ఉన్న ఇతర ప్లేస్ లను కూడా.. మహాజర్ చేశారు. ఈ కేసులు పోలీసులు చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ ను కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటె.. రేణుక స్వామి హత్య కేసులో.. దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం.. దాదాపు రూ.30 లక్షల నగదు చేతులు మారినట్లు సమాచారం.. ఆ డబ్బును కూడా పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. దానికి సంబంధించిన డబ్బు దగ్గర వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ఇంటిపై రైడ్ చేసి డబ్బును సీజ్ చేశారు. ఇక రేణుకస్వామిని కిడ్నప్ చేసి… బెంగుళూరుకి తీసుకువచ్చే క్రమంలో.. అనేక సార్లు తప్పించుకునే అవకాశం వచ్చినా కూడా.. తప్పించుకోలేదని పోలీసుల విచారణలో బయటపడింది. నిందితుడు రవి ఇచ్చిన సమాచారం ప్రకారం.. రవి కారును అద్దెకు నడుపుతూ ఉంటాడు.. ఈ క్రమంలో అతని స్నేహితుడు.. జగ్గు కాల్ చేసి బెంగుళూరు వెళ్లాలని కోరాడని.. చిత్ర దుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకస్వామి కారు ఎక్కారని.. కారులో బెంగుళూరు ప్రయాణిస్తుండగానే.. వారు పవిత్ర కు పంపిన మెసేజ్ ల గురించి ప్రశ్నించగా.. మెసేజ్ లు పంపడం తనకు హాబీ అని చెప్పుకొచ్చాడట రేణుకస్వామి.

ఇక కార్ బెంగళూరు వెళ్లే మార్గంలో పలు మార్లు నిలిపినా కూడా రేణుకస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదని చెప్పుకొచ్చాడు. కారు బెంగళూరు కామాక్షి పాళ్యలోని షెడ్ దగ్గరకు చేరుకోగానే.. అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారని.. వారంతా రేణుకస్వామిని చూసి.. ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని .. విచారణలో భాగంగా రవి ద్వారా బయటకు వచ్చాయి. ఈ కేసు విషయమై పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments