Mysore Gas Cylinder Leakage Entire Family Death: కుందనపు బొమ్మల్లాంటి అక్కాచెల్లెళ్లు.. రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో!

కుందనపు బొమ్మల్లాంటి అక్కాచెల్లెళ్లు.. రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో!

కుందనపు బొమ్మల్లాంటి అక్కాచెల్లెళ్ల జీవితాల్లో ఆ రాత్రి కాళరాత్రి అయ్యింది. వారి జీవితాల్లో ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఇంతకు ఏం జరిగిందంటే..

కుందనపు బొమ్మల్లాంటి అక్కాచెల్లెళ్ల జీవితాల్లో ఆ రాత్రి కాళరాత్రి అయ్యింది. వారి జీవితాల్లో ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఇంతకు ఏం జరిగిందంటే..

కొన్ని సంఘటనలు చూస్తే.. మనిషి జీవితం మరి ఇంత విచిత్రంగా ఉంటుందా.. అనిపించకమానదు. ఈమాత్రం దానికే మనం ఎన్నో వేషాలు.. మరెన్నో రూపాలు ధరిస్తుంటాం. నిజంగానే ఓ సినిమా కవి చెప్పినట్లు కన్ను మూస్తే మరణం.. కన్ను తెరిస్తే జననం. నిద్ర పోయిన మనిషి తిరిగి లేచేంతవరకు అతడు బతికి ఉన్నాడు అనే దానికి గ్యారెంటీ లేదు. భూమ్మీద నూకలుంటే కళ్లు తెరిచి కొత్త రోజును చూస్తాము.. లేదంటే.. నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోతాము. ఎప్పుడు ముగుస్తుందో తెలియని జీవితం కోసం రకరకాల పాకులాటలు.. ఎన్నో ప్రయాసలు. మన దగ్గర ఎంత డబ్బున్న.. ఎంత గొప్పగా బతికినా.. మరణాన్ని మాత్రం అంచనా వేయలేం. పైన ఫొటోలో కనిపిస్తున్న అక్కాచెల్లెళ్ల జీవితాల్లో కూడా అలాంటి విషాదమే చోటు చేసుకుంది. ఆ రాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిలను చూశారా.. ఎంత చక్కగా.. కుందనపు బొమ్మల్లా ఉన్నారో అనిపిస్తుంది కదా. చక్కగా కాలేజీకి వెళ్తూ.. తల్లిదండ్రులతో కలిసి ఎంతో సంతోషంగా సాగుతున్న వారి జీవితాలు ఒక్క రాత్రిలో ముగిసిపోయాయి. పెళ్లికి వెళ్లి అలసిపోయి వచ్చి నిద్రపోయిన వారు.. శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. కుటుంబం మొత్తాన్ని గ్యాస్‌ సిలిండర్‌ బలి తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటన కర్ణాటక మైసూరులో చోటు చేసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ కావడంతో.. ఊపిరాడక.. కుటుంబంలోని వారంతా కన్నుమూశారు. ఈ సంఘటన చిక్కమగళూరు, జిల్లా కడూరు సకరాయపట్టణంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందని కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు అర్చన(19), స్వాతి (17) సంతానం ఉన్నారు. రజక వృత్తిలో ఉంటూ.. ఒక చిన్న ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరు ఉండే ఇల్లు ఎంత చిన్నది అంటే.. దానికి వెనక, ముందు ఒక్కో కిటికీ మాత్రమే ఉన్నాయి. ఇంట్లో వారి వృత్తికి సంబంధించిన ఇస్త్రీ పెట్టే.. కొద్ది పాటి సామానుతో చిన్న ఇంట్లోనే నలుగురు ఉండేవారు. ఈ క్రమంలో తాజాగా కుటుంబం అంతా ఓ పెళ్లికి వెళ్లి.. సోమవారం నాడు తిరిగి వచ్చారు. బాగా అలసి పోయి ఉండటంతో.. రాగానే నిద్రకు ఉపక్రమించారు. కిటికీలు కూడా తెరవలేదు. అయితే దురదృష్టవశాత్తు.. రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయ్యింది. కిటికీలు, తలుపులు మూసి ఉండటంతో.. ఇల్లంతా దట్టంగా గ్యాస్‌ వ్యాపించింది.

నిద్రపోతున్న కుటుంబ సభ్యులు మత్తులోనే ఆ గ్యాస్‌ను పీల్చి స్పృహ తప్పారు. కొన్ని గంటల తర్వాత ప్రాణాలు వదిలారు. గ్యాస్‌ను పీల్చడంతో అందరి ముక్కులు, చెవుల్లోంచి రక్తం వచ్చింది. ఇల్లంతా గ్యాస్‌ వాసన కమ్ముకుంది. సోమవారం రాత్రి నిద్రపోయిన వారు.. మంగళవారం ఉదయానికి మృతి చెందినట్లు భావిస్తున్నారు. చుట్టుపక్కల వారు కూడా గమనించలేదు. ఇక బుధవారం ఉదయం కుమారస్వామి బంధువు అతడి నంబర్‌కు కాల్‌ చేశాడు. ఎన్నిసార్లు కాల్‌ చేసిన లిఫ్ట్‌ చేయకపోవడంతో.. అనుమానం వచ్చి.. కుమారస్వామి ఇంటి ఇరుగుపొరుగు వారికి కాల్‌ చేశాడు. ఏం జరిగిందో చూడమని కోరాడు. చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా.. అప్పటికే ఇంట్లో ఉన్న నలుగురు మృత్యువాత పడ్డారు. వెంటనే దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల ఇంటి వద్దకు వచ్చి.. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇంట్లో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉండగా.. రెండు లీక్‌ అయ్యి.. పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఇక గ్యాస్‌ పీల్చడం వల్లే వారు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం.. ఆస్పత్రికి తరలించారు. 3 గ్యాస్‌ సిలిండర్లను విచారణ కోసం సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నిండింది.

Show comments