Darshan Case Update On June 13th 2024: అభిమాని హత్య కేసు: జైలులో దర్శన్‌ కష్టాలు.. ఒక్క సిగరెట్‌ కోసం

Darshan: అభిమాని హత్య కేసు: జైలులో దర్శన్‌ కష్టాలు.. ఒక్క సిగరెట్‌ కోసం

అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలతో ప్రస్తుతం జైలులో ఉన్నాడు కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌. ఇక జైలులో అతడు ఎంతో ఇబ్బంది పడుతున్నాడని.. తెలుస్తోంది. ఆ వివరాలు..

అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలతో ప్రస్తుతం జైలులో ఉన్నాడు కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌. ఇక జైలులో అతడు ఎంతో ఇబ్బంది పడుతున్నాడని.. తెలుస్తోంది. ఆ వివరాలు..

అభిమాని హత్య కేసులో కన్నడ సూపర్‌ స్టార్‌ దర్శన్‌ అరెస్ట్‌ అయ్యి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా తన స్నేహితురాలిని అసభ్యకరంగా దూషించాడనే కారణంతో.. రేణుకస్వామి అనే వ్యక్తిని హత్య చేయించాడంటూ దర్శన్‌పై ఆరోపణలు రావడంతో జైలుకు వెళ్లాడు. ఎంతో కష్టపడి కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. కన్నడ నాట సూపర్‌ స్టార్‌గా ఎదిగిన దర్శన్‌.. చివరకు ఇలాంటి కేసులో అరెస్ట్‌ అవ్వడం సంచలనంగా మారింది.. చిత్ర పరిశ్రమలో రాణించాలనుకునే ఎందరికో దర్శన్‌ ఆదర్శం. సినిమాల్లో ఎంత క్రేజ్‌ తెచ్చుకున్నాడో.. వివాదాల్లో కూడా అలానే చిక్కకుంటూ ఉంటాడు. ఇన్నాళ్లు చిన్న చిన్న గొడవలు కానీ ఇప్పుడు ఏకంగా మర్డర్‌ కేసులో ఇరుక్కుని.. జైలు పాలయ్యాడు దర్శన్‌.

ఇక ఇన్నాళ్లు సూపర్‌స్టార్‌గా.. ఎంతో వైభవంగా.. రాయల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేసిన దర్శన్‌.. ఇప్పుడు జైలులో.. నిస్సహాయ స్థితిలో.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నాడట. క్షణికావేశంలో తాను ఎలాంటి తప్పు చేశానో గుర్తు చేసుకుని.. బాధపడుతున్నాడకని తెలుస్తోంది. ఇన్నాళ్లు స్టార్‌ హీరోగా లగ్జరీ లైఫ్‌ను అనుభవించిన దర్శన్‌ ఇప్పుడు జైలులో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు దర్శన్‌ను ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక విచారణ సమయంలో దర్శన్‌.. ఎంతో దిగులుగా కనిపించాడు. ఒక్క సిగరెట్‌ ఇవ్వమంటూ పోలీసులను వేడుకున్నాడట. చేతులు వణుకుతున్నాయి.. ఒక్క సిగరెట్‌ ప్లీజ్‌ అని అభ్యర్థించినా.. పోలీసులు అందుకు అంగీకరించలేదట. ఇక విచారణ సమయంలో ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. రేణుకస్వామిని హత్య చేయమని తాను చెప్పలేదని పదే పదే చెబుతున్నట్లు తెలుస్తోంది.

రేణుకాస్వామి.. పవిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తెలుసుకున్న దర్శన్‌.. అతడిని కిడ్నాప్‌ చేసి మరి హత్య చేయించాడని తెలుస్తోంది. ఇందుకోసం దర్శన్‌.. నిందితులకు 30 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక ఈ దారుణంపై కన్నడ నాట పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దర్శన్‌కు వ్యతిరేకంగా వందలాది మంది రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని.. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సినిమాల్లో హీరో పాత్రలు చేసే దర్శన్‌ నిజ జీవితంలో మాత్రం విలన్‌.. రేణుకాస్వామితో ఇబ్బందిగా ఉంటే.. పోలీసులు ఫిర్యాదు చేయాల్సింది పోయి.. ఇంత దారుణంగా హత్య చేయించడం సరైంది కాదని మండిపడుతున్నారు.

Show comments