Abhay OTT: ఏకంగా 23 ఏళ్ళ తర్వాత OTT లోకి కమల్ హాసన్ సైకో కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Abhay OTT: ఏకంగా 23 ఏళ్ళ తర్వాత OTT లోకి కమల్ హాసన్ సైకో కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Kamal Hasan Movie in OTT After 23 Years: కొన్ని సినిమాలు వారాలు నెలలు గడవకముందే ఓటీటీ లోకి వచ్చేస్తుంటే మరి కొన్ని సినిమాలు ఏడాది గడిచిన ఓటీటీ లో కనిపించడం లేదు. కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. చాలా ఆలస్యంగా కొన్ని సినిమాలు ఓటీటీ లో ప్రత్యేక్షం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా ఒకటి రెండు కాదు ఏకంగా 23 ఏళ్ళ తర్వాత ఓటీటీ లోకి వచ్చేసింది.

ఇప్పుడు ఓటీటీ కి పెరుగుతున్న ఆదరణ ప్రభావమో ఏమో తెలియదు కానీ.. కొన్ని సినిమాలు ఏళ్ళు గడిచిన తర్వాత ఓటీటీ లో దర్శనం ఇస్తున్నాయి. పైగా ఒకప్పుడు హిట్ కానీ చిత్రాలు కూడా ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ పుణ్యమా అని తెగ పాపులర్ అయిపోతున్నాయి. ఇప్పటికే ఇలా ఏడాది తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంటున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరొక సినిమా ఒకటి రెండు కాదు ఏకంగా 23 ఏళ్ళ తర్వాత ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అదే కమల్ హాసన్ నటించిన ఆళవందన్ మూవీ తెలుగులో అభయ్.. మరి ఈ సినిమా ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఓటీటీ కి రావడానికి కారణం ఏంటి.. అసలు ఈ సినిమా ఏ ఓటీటీ లో ప్రసారం కానుంది అనే విషయాలను చూసేద్దాం.

కమల్ హాసన్ నటించిన ఆళవందన్ మూవీ.. 2001 లో థియేటర్ లో రిలీజ్ అయింది, తెలుగులో ఈ సినిమా అభయ్ పేరుతో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అప్పటిలో చాలా హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు సైతం థియేటర్ లో విడుదలైన వారం పది రోజులకే ఓటీటీ లోకి వస్తున్న తరుణంలో ఈ సినిమా ఏకంగా 23 ఏళ్ళ తర్వాత ఓటీటీ లోకి రావడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఈ సినిమాలో కమల హాసన్ డ్యూయల్ రోల్ లో ప్రేక్షకులను అలరించాడు. ర‌వీనా టాండ‌న్‌, మ‌నీషా కోయిరాల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ కోసం ఈ సినిమాను 4కే వెర్షన్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కమల్ హాసన్ కెరీర్ లో టాప్ టెన్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమా స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోగా, విల్లన్ గా కమల్ హాసన్ ప్రేక్షకులను అయితే మెప్పించాడు కానీ.. కమర్షియల్ పరంగా మాత్రం ఈ సినిమా సక్సెస్ సాధించలేకపోయింది. ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. దీనితో ఆ సమయంలో ఇంత భారీ బడ్జెట్ తో రూపొందించిన అభయ్ సినిమా గురించి బాగానే చర్చలు జరిగాయి. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా విజయం సాధించలేకపోయినా కూడా.. ఎన్నో అవార్డులను మాత్రం సంపాదించుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటి జెనెరేషన్ వారిని ఏ రకంగా ఆకట్టుకుంటుందో చూడాలి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments