Kalki 2898 AD: దాన్ని దృష్టిలో పెట్టుకునే కల్కి తీశా! నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Kalki 2898 AD: దాన్ని దృష్టిలో పెట్టుకునే కల్కి తీశా! నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. దాన్ని దృష్టిలో పెట్టుకునే కల్కి మూవీ తీశానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. దాన్ని దృష్టిలో పెట్టుకునే కల్కి మూవీ తీశానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

జూన్ 27.. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ తో బాక్సాఫీస్ పై యుద్ధం చేయడానికి వస్తున్నాడు. రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొడుతున్న ఈ చిత్రం.. విడుదల తర్వాత ఏ రేంజ్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందో చూడడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక విడుదలైన ట్రైలర్ తో కల్కి పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినీ పండితులు. మేకర్స్ సైతం ప్రమోషన్లను గట్టిగానే చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నాగ్ అశ్విన్.

‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది. దాంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతోంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తున్నారు చిత్ర యూనిట్. అందులో భాగంగా తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సందర్భంగా స్టార్ యాక్టర్స్ తో కలిసి పనిచేయడం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వారితో పనిచేయడం ఎలా ఉందో వివరించాడు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..”కల్కి మూవీలో ఎంతో మంది బిగ్ స్టార్స్ నటించారు. అలాంటి వారిని డైరెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. అమితాబ్, కమల్ హాసన్ లాంటి గొప్ప నటులకు నేను సీన్స్ వివరించడం సిల్లీగా అనిపించింది. దిగ్గజ నటులుగా వారు నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈ మూవీలో బిగ్ బి అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో అలరిస్తాడు. వీరిద్దరు ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండి, నేర్చుకుంటూనే ఉంటారు. నేను కల్కి మూవీని ప్రభాస్, దీపికా పదుకొణెలకు ఉన్న స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకునే తీశాను. వాళ్ల ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అలాగే ఇందులో చూపించాను” అంటూ చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. కాగా.. ఈ మూవీకి సీక్వెల్ ఉందా? అని ప్రశ్నించగా.. నవ్వుతూ మరో ప్రశ్న అడగాలని ఆన్సర్ ఇచ్చాడు డైరెక్టర్ సాబ్.

Show comments