దేవర ఊచకోత.. హక్కుల కోసం కోట్లు! యంగ్ టైగర్ రేంజ్ అట్లుంటది..

దేవర ఊచకోత.. హక్కుల కోసం కోట్లు! యంగ్ టైగర్ రేంజ్ అట్లుంటది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర మూవీ రిలీజ్ కు ముందే రికార్డుల ఊచకోత మెుదలుపెట్టింది. దేవర హక్కులకు వచ్చిన ఊహించని రెస్పాన్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర మూవీ రిలీజ్ కు ముందే రికార్డుల ఊచకోత మెుదలుపెట్టింది. దేవర హక్కులకు వచ్చిన ఊహించని రెస్పాన్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 10న రావాల్సిన ఈ మూవీ ముందుగానే థియేటర్లలోకి రానుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే దేవరకు సోలో రిలీజ్ దొరకడంతో.. వీకెండ్ తో పాటుగా గాంధీ జయంతి సెలవు కూడా కలిసి రావడంతో.. భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ, శాటిలైట్ అన్ని రకాల హక్కులు కలుపుకుని భారీ స్థాయిలో బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అనుకున్న డేట్ కంటే ముందే దేవర రిలీజ్ అవుతుండటంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముందుగా దసరా కానుకగా అక్టోబర్ 10న వస్తుందనుకున్న దేవర, సెప్టెంబర్ 27నే థియేటర్లలోకి రానుంది. కాగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దేవర హక్కులకు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దేవర హక్కుల సంబంధించి అన్ని ఒప్పందాలు పూర్తైయ్యాయని ఇన్ సైడ్ టాక్. తెలుగు రాష్ట్రాల్లో మెుత్తం హక్కులను సితారా ఎంటర్ టైన్ మెంట్ సొంతం చేసుకుందని, అలాగే నైజాం ఏరియా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది.

ఇక ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని హంసిని ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్స్ రచిస్తోంది. ఇక బాలీవుడ్ లో దేవరను రిలీజ్ చేయనున్నారు అనిల్ తదాని, కరణ్ జోహార్. ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెుత్తం హక్కులు కలిపి దాదాపు రూ. 500 కోట్ల వరకు బిజినెస్ చేసిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కోణంలో చూస్తే.. ఇది ఊహించని ధరే. మెుత్తంగా చూసుకుంటే.. టేబుల్ ప్రాఫిట్ పైనే రిలీజ్ అవుతుంది. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. యంగ్ టైగర్ రేంజ్ అంటే అట్లుంటదని కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు. రిలీజ్ కు ముందే కోట్లు కొల్లగొట్టిన దేవర.. విడుదల తర్వాత ఏం రేంజ్ కలెక్షన్లు కొల్లగొడుతుందా? అని ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Show comments