అఫిషియల్: అనుకున్న తేదీ కంటే ముందే వస్తున్న దేవర

అఫిషియల్: అనుకున్న తేదీ కంటే ముందే వస్తున్న దేవర

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర దసరా సందర్భంగా.. అక్టోబరు నెలకు వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ అనుకున్న తేదీకన్నా ముందుగానే వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇంతకి ఎప్పుడుంటే..

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర దసరా సందర్భంగా.. అక్టోబరు నెలకు వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ అనుకున్న తేదీకన్నా ముందుగానే వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇంతకి ఎప్పుడుంటే..

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోని సినిమాల వాయిదాల ట్రెండ్ అనేది జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలే వరుసగా వాయిదాలు మీద వాయిదాలు పడుతున్నాయి. అయితే ఇలా మూవీస్ వాయిదాలకు పడటానికి కారణం.. పాన్ ఇండియా మూవీస్. ఎందుకంటే.. ఇప్పుడు స్టార్ హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కనుక ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా పాన్ ఇండియ ట్రెండ్ అనేది ఎక్కువగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సినిమాలకు సంబంధించిన షూటింగ్స్, నిర్మాణా ప్రొడక్షన్స్ లో జరుగుతున్న వర్క్స్ ఆలస్యం కావడంతో.. ముందుగా పలానా తేదీకి అనుకున్న సినిమాలన్నీ వాయిదాలు పడుతున్నాయి. మరి అలాంటి సినిమాల్లో ఎన్టీఆర్ సినిమా కూడా ఒకటి.

ఎన్టీఆర్ కథానయికుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర;. ఇక ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. అయితే దేవర సినిమాను నిజానికి ఈ వేసవి సెలవుల్లో రావాల్సి ఉండగా.. అది మళ్లీ అక్టోబరు 10వ తేదీకి వాయిదా పడింది. కానీ, ఈసారి మాత్రం దేవర సినిమా అనుకున్న తేదీకన్నా ముందుగానే అనగా.. సెప్టెంబరు 27వ తేదీన విడుదల చేయునున్నట్లు చిత్ర బృందం నుంచి అఫిషియల్ గా చిత్ర యూనిట్ తాజాగా  ప్రకటించారు. ఇక అదే సెప్టెంబరు 27కు పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఆ సినిమా ఇంక చిత్రీకరణ మిగిలి ఉంది. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ తేదీకి ఓజీ సినిమా రావడం చాలా కష్టమే. అందుకే ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేయాలనే ప్రణాళికతో చిత్రబృందం అడుగులు వేసింది.

ఇక  అందుకు తగ్గట్టుగానే దేవర చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. కాగా, ఇటీవలే దేవర సినిమాకు సంబంధించి గోవాలో కీలకమైన షెడ్యూల్‌ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే.. అనుకున్నతేదీ కన్నా ముందుగానే దేవర వస్తుందని ప్రకటించడంపై.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి అయిన దేవర మూవీ అనుకున్న తేదీకి వస్తుందా..? మళ్లీ వాయిదా వేస్తారా..?  అని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. దేవర సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్ గా నటిస్తున్నారు. మరి, ఎన్టీఆర్ దేవర సినిమా అనుకున్ తేదీకన్నా ముందుగా వస్తుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments