Janhvi Kapoor: ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది.. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై జాన్వీ కామెంట్స్!

Janhvi Kapoor: ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది.. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై జాన్వీ కామెంట్స్!

సినిమాలలో నటించే వారి గురించి, స్టార్ సెలెబ్రిటీల గురించి.. నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చూస్తూనే ఉంటాము, అయితే వారి ఫొటోస్ సోషల్ మీడియాలోకి ఎలా వస్తాయి అనే విషయంపై.. ప్రముఖ సెలెబ్రిటీ కొన్ని ఆసక్తి కర విషయాలు చెప్పుకొచ్చింది.

సినిమాలలో నటించే వారి గురించి, స్టార్ సెలెబ్రిటీల గురించి.. నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చూస్తూనే ఉంటాము, అయితే వారి ఫొటోస్ సోషల్ మీడియాలోకి ఎలా వస్తాయి అనే విషయంపై.. ప్రముఖ సెలెబ్రిటీ కొన్ని ఆసక్తి కర విషయాలు చెప్పుకొచ్చింది.

సినిమాలలో స్టార్ సెలెబ్రిటీలు ఎలా ఉంటారు ఏంటి అనేది అందరికి తెలుసు.. వారికి సంబందించిన మూవీ లుక్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే వారి వారి పర్సనల్ ఫొటోస్ కూడా వారంతట వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా.. వారు బయట షాపింగ్ మాల్స్ లోనో, ఎయిర్‌పోర్ట్‌, జిమ్, పార్టీ , ఈవెంట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఫోటోగ్రాఫర్స్ ఎగబడి మరి ఫోటోలు తీస్తూ ఉంటారు. మరి సెలెబ్రిటీలు ఎక్కడికి వెళ్తున్నారో ఆ ఫోటోగ్రాఫర్స్ కు ఎలా తెలుస్తుంది, ఇది సాధారణంగా అందరికి వచ్చే ప్రశ్న . కానీ చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు. అయితే దీనికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో తాజాగా జాన్వీ కపూర్ ఫోటోగ్రాఫర్స్ గురించి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ఫోటోగ్రాఫర్స్ గురించి జాన్వీ చెప్తూ.. “చాలా ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నప్పుడు.. ఫోటోగ్రాఫర్స్ హీరో హీరోయిన్స్ ను వెతుక్కుంటూ వస్తారు. కానీ సినిమా ప్రమోషన్ వగైరా ఉంటే డబ్బులు చెల్లించి వారిని పిలవాలి. ఇప్పుడు ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా ప్రమోషన్ జరుగుతోంది. కాబట్టి నా ఫోటోలు క్లిక్ చేయడానికి వారు వచ్చారు. కానీ సినిమా షూటింగ్ లేనప్పుడు, నేను నా పనిలో బిజీగా ఉన్నప్పుడు వారు నా కారును ఫాలో అవుతారు. కష్టపడి నన్ను ఫోటోలు తీస్తారు దీనికి డబ్బులు తీసుకుంటుంటారు.” అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

అలాగే ప్రతి బాలీవుడ్ సెలబ్రిటీకి ఒక రేట్ ఉంటుందట. స్టార్ యాక్టర్స్ అయితే ఒక రేటు. చిన్న వారికీ ఒక రేటు ఉంటుందట. స్టార్ సెలెబ్రిటీలు అయితే వాళ్ళను వెతుక్కుంటూ ఫోటోగ్రాఫర్స్ వెళ్తారు. పెద్ద స్టార్ కాకపోతే ఫోటోగ్రాఫర్స్ ను స్టార్స్ పిలవాలి. గతంలో ప్రముఖ నటి ప్రియమణి కూడా దీని గురించి చెప్పుకొచ్చింది. హిందీ సినిమాలలో నటించినప్పుడు అక్కడి ఫోటోగ్రాఫర్స్ గురించి కొన్ని ఆసక్తి కర కామెంట్స్ చేసింది. సెలబ్రిటీలు ఫోటో గ్రాఫర్లకు ఫోన్ చేసి వారి ఫోటోలను తీయించుకుంటారని.. కానీ ఫోటో గ్రాఫర్లు తమ కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఫొటోలు క్లిక్ మనిపిస్తారని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు జాన్వీ కూడా ఇదే చెప్పుకొచ్చింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments