క్యాపిటల్స్‌ టీమ్‌లోకి నన్ను తీసుకొచ్చింది అతనే: ఆసీస్‌ చిచ్చరపిడుగు

క్యాపిటల్స్‌ టీమ్‌లోకి నన్ను తీసుకొచ్చింది అతనే: ఆసీస్‌ చిచ్చరపిడుగు

Jake Fraser McGurk, David Warner, Dubai Capitals: ఐపీఎల్‌ 2024లో విధ్వంసం సృష్టించిన జేక్‌ ఫ్రేజర్.. తనను క్యాపిటల్స్‌ టీమ్‌లోకి తీసుకొచ్చిన ప్లేయర్‌ ఎవరో వెల్లడించాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Jake Fraser McGurk, David Warner, Dubai Capitals: ఐపీఎల్‌ 2024లో విధ్వంసం సృష్టించిన జేక్‌ ఫ్రేజర్.. తనను క్యాపిటల్స్‌ టీమ్‌లోకి తీసుకొచ్చిన ప్లేయర్‌ ఎవరో వెల్లడించాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఐపీఎల్‌ 2024లో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ అనే కుర్రాడు ఎలాంటి విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ తరఫున బరిలోకి దిగిన ఈ ఆసీస్‌ అండర్‌ 19 కుర్రాడు.. హేమాహేమీ బౌలర్లను చీల్చి చెండాడు. ఓపెనర్‌గా వచ్చీ రావడంతోనే ఎదురుగా ఏ బౌలర్‌ ఉన్నది కూడా చూడకుండా.. విధ్వంసం సృష్టించే వాడు. వేగంగా కాదు.. అతి వేగంగా ఆడే క్రమంలో కొన్ని సార్లు అవుటైనా అతని ఇంప్యాక్ట్‌ ఐపీఎల్‌ మొత్తంపై ఈ కుర్రాడి కోసం ఢిల్లీ జట్టు ఏకంగా డేవిడ్‌ వార్నర్‌ లాంటి మ్యాచ్‌ విన్నర్‌ను పక్కనపెట్టిందంటే.. అర్థం చేసుకోవచ్చు అతను ఎలాంటి బ్యాటరో.

అయితే.. ఈ కుర్రాడు ప్రపంచ క్రికెట్‌కు పరిచయం అవ్వడం వెనుక మాత్రం ఓ స్టార్‌ క్రికెటర్‌ సాయం ఉంది. ఆ స్టార్‌ క్రికెటర్‌ ఎవరో కాదు డేవిడ్‌ వార్నర్‌. తనకు పోటీ వచ్చి, తన ఓపెనింగ్‌ స్పాట్‌కు ఎసరుపెడతాడని తెలిసి కూడా వార్నర్‌.. దేశానికి, ‍ప్రపంచ క్రికెట్‌కు ఒక అద్భుతమైన ప్లేయర్‌ను ఇవ్వాలని, పరిచయం చేయాలని అనుకున్నాడు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ టోర్నీలో దుబాయ్‌ క్యాపిటల్స్‌ టీమ్‌లోకి జేక్‌ ఫ్రేజర్‌ను తీసుకొచ్చాడు. ఆ కుర్రాడి నంబర్‌ కనుక్కొని మరీ అతనికి కాల్‌ చేసి.. దుబాయ్‌ క్యాపిటల్స్‌కు ఆడతావంటూ అడిగాడు వార్నర్‌.

ఈ విషయాన్ని స్వయంగా జేక్‌ వెల్లడించాడు. అతను మాట్లాడుతూ.. ‘వార్నర్ నన్ను బాగా చూసుకుంటున్నాడు, నిజానికి అతను నన్ను దుబాయ్ క్యాపిటల్స్‌ టీమ్‌లోకి తెచ్చింది ఆయనే. టీమ్‌లో చేరుతావా అంటూ నాకు మేసేజ్‌ చేశాడు నేను సరే అన్నాను.’ అని జేక్‌ ఫ్రేజర్‌ తెలిపాడు. అయితే.. వార్నర్‌కు తన నంబర్‌ ఎలా తెలుసో తనకు తెలియదంటూ పేర్కొన్నాడు జేక్‌. మరి కొత్త కుర్రాడు జేక్‌ ఫ్రేజర్‌ విషయంలో వార్నర్‌ చూపించి చొరవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments