Jabardasth Latest Promo-Indraja Good Bye To Show: ఇంద్రజ షాకింగ్‌ నిర్ణయం.. జబర్దస్త్‌కు గుడ్‌బై.. కారణమిదేనా?

Indraja: ఇంద్రజ షాకింగ్‌ నిర్ణయం.. జబర్దస్త్‌కు గుడ్‌బై.. కారణమిదేనా?

గత కొన్నాళ్లుగా జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు జడ్జీగా వ్యవహరిస్తోన్న ఇంద్రజ.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

గత కొన్నాళ్లుగా జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు జడ్జీగా వ్యవహరిస్తోన్న ఇంద్రజ.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

బుల్లితెర మీద ఎన్నో ఏళ్లుగా ప్రసారం అవుతున్న కామెడీ షోలు జబర్దస్త్‌, ఎక్స్‌టా జబర్దస్త్‌. ఏళ్ల తరబడి ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ రెండు కార్యక్రమాల ద్వారా.. ఎందరో కమెడియన్లు.. బుల్లితెరకు పరిచయం అయ్యారు. వీరిలో కొందరు ఇప్పుడు సినిమాల్లో కమెడియన్లుగా కూడా రాణిస్తుండగా.. కొందరైతే ఏకంగా హీరోలుగా మారారు. జబర్దస్త్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత యాంకర్‌గా, ఇప్పుడు హీరోగా మారాడు సుధీర్‌. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా గెటప్‌ శ్రీను.. రాజు యాదవ్‌ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక జబర్దస్త్‌ కార్యక్రమంలో పని చేసే కంటెస్టెంట్లకు మాత్రమే కాక జడ్జీలు కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక ప్రారంభంలో ఈ షోకు రోజా, నాగబాబు జడ్జీలుగా వ్యవహరించేవారు. తర్వాత వారు షో నుంచి తప్పుకోవడంతో.. ఆ ప్లేస్‌లోకి కొందరు సెలబ్రిటీలు వచ్చారు. రోజా తర్వాత ఇంద్రజ జబర్దస్త్‌ షోకు పర్మినెంట్‌ జడ్జీగా మారారు. మేల్‌ జడ్జీల స్థానంలో ముందు మనో.. ఇప్పుడు కృష్ణ భగవాన్‌లు చేస్తున్నారు. ఇక ఇంద్రజ జబర్దస్త్‌కు జడ్జీగా రావడం పట్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. అనతి కాలంలోనే ఆమె జబర్దస్త్‌కు పర్మినెంట్‌ జడ్జీగా మారారు. ప్రేక్షకుల్లో ఆమెకు రోజు రోజుకు ఆదరణ పెరగడంతో.. జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లతో పాటు.. శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఆమెని జడ్జీగా నియమించారు.

కంటెస్టెంట్లకు పంచులు వేయడం.. డ్యాన్స్‌తో మెస్మరైజ్‌ చేయడం.. అందమైన చిరునవ్వుతో అలరించడం మాత్రమే.. కాక ఎవరైనా తమ బాధలు చెప్పుకుంటే.. ఇంద్రజ కూడా కన్నీటి పర్యంతం అవుతారు. ఇక షోలకు వచ్చి సాయం కోరే వారికి.. తనకు తోచిన మేర హెల్ప్‌ చేసి ఆదుకుంటారు. కేవలం జడ్జీగా మాత్రమే కాక.. మంచి మనిషిగా ఎందో ఆదరణ.. ఎందరో ప్రేక్షకులు అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఇంద్రజ. ఇక సుధీర్‌-ఇంద్రజల మధ్య తల్లీ కొడుకులు అనుబంధం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. జబర్దస్త్‌ షోకు కంటెస్టెంట్లు ఎంత ముఖ్యమో.. ఇంద్రజ కూడా అంతే ఇంపార్టెంట్‌ అన్న రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఉండగా.. తాజాగా ప్రేక్షకులు, అభిమానులకు షాక్‌ ఇచ్చారు ఇంద్రజ. జబర్దస్త్‌ షోకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు.

ఈవారం అనగా మే 30, గురువారం నాడు ప్రసారం కాబోయే జబర్దస్త్‌ షోకు సంబంధించినప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనిలో షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు ఇంద్రజ. తాను జబర్దస్త్‌ షోకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. కొన్నాళ్ల పాటు.. షోకు గ్యాప్‌ ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రోమో చివర్లో ఇంద్రజ కన్నీళ్లతో ఈ విషయాన్ని ప్రకటించారు. కొన్నాళ్లు జబర్దస్త్‌ షో నుంచి గ్యాప్‌ తీసుకోబోతున్నాను అని ప్రకటించారు. ఆమె మాటలు విన్నవారంతా ఒక్క సారి షాక్‌కు గురయ్యారు. తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈవారం ఎపిసోడ్‌లో నూకరాజు బుర్రకథ స్కిట్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇంద్రజ జబర్దస్త్‌ షోకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పనున్నారా.. లేక సినిమాలు, ఇతర ప్రాజెక్ట్‌ల వల్ల ​కొన్నాళ్లు షోకు దూరంగా ఉంటారా అనేది తెలియాలంటే.. ఈ వారం షో చూడాల్సిందే.

Show comments