Modi Big Decision: మోదీ మూడోసారి గెలిస్తే అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారా?

మోదీ మూడోసారి గెలిస్తే అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారా?

Modi Big Decision: నరేంద్ర మోదీ మూడోసారి గెలిస్తే అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణమా? అసలు మోదీ ఏం చేయబోతున్నారు? మోదీ నిర్ణయంతో దేశంలో చోటు చేసుకోబోతున్న కీలక మార్పులు ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మంది మదిలో మెదులుతున్నాయి.

Modi Big Decision: నరేంద్ర మోదీ మూడోసారి గెలిస్తే అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఇందుకు కారణమా? అసలు మోదీ ఏం చేయబోతున్నారు? మోదీ నిర్ణయంతో దేశంలో చోటు చేసుకోబోతున్న కీలక మార్పులు ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మంది మదిలో మెదులుతున్నాయి.

ఇంగ్లాండ్ లో ఉన్న వంద టన్నుల బంగారాన్ని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ యూకేలో నిల్వ చేసిన 100 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ స్వదేశీ వాల్ట్ లకు తరలించింది. 1991 తర్వాత ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని స్వదేశానికి తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం. మార్చి 2024 నాటికి ఆర్బీఐ వద్ద 822.10 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మెజారిటీ గోల్డ్ విదేశాల్లో నిల్వ చేయబడి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కొన్న బంగారాన్ని విదేశాల్లోనే నిల్వ చేయడం జరుగుతుంది. ప్రపంచంలో ఇతర దేశాల్లానే భారతదేశం కూడా బంగారాన్ని ఏళ్లుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గోల్డ్ వాల్ట్ లో భద్రపరుస్తూ వచ్చింది. ఎప్పుడైనా సంక్షోభం తలెత్తినప్పుడు ఇందులో కొంత భాగాన్ని వినియోగించడం కోసం ఇలా చేస్తారు.

ప్రస్తుతం ఈ బంగారంతో ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం 408 టన్నులకు చేరినట్లు సమాచారం. అంటే 822 టన్నుల బంగారంలో సగం మన దగ్గర ఉండగా.. మిగతా సగం విదేశాల్లో ఉంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంద మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఎందుకు వెనక్కి తీసుకొచ్చిందన్న సందేహం చాలా మందిలో ఉంది. దీనికి పలు కారణాలు ఉన్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో.. విదేశాల్లో ఉన్న రష్యా రాజధాని మాస్కోకి చెందిన ఆస్తులను ఆయా దేశాలు ఫ్రీజ్ చేశాయి. భారత్, రష్యా ఎప్పటి నుంచో మిత్ర దేశాలు. రష్యాకు భారత్ మద్దతు ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అనివార్యం అన్నప్పుడు భారత్ కూడా రష్యాతో చేయి కలుపుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల్లో భారత్ కి చెందిన ఆస్తులను ఉంచడం కరెక్ట్ కాదన్న కారణంతో ఇంగ్లాండ్ లో ఉన్న పసిడిని భారత్ కి తెప్పించినట్లు సమాచారం. మరోవైపు సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలు.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా 400 ఎంపీ స్థానాలు ఇవ్వాలని కోరడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తుంది. వీటన్నిటికీ తోడు యూకే నుంచి 100 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ వెనక్కి రప్పించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. మోదీ గెలిస్తే భారత ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ నుంచి భారత్ కు 100 టన్నుల బంగారం రావడం మంచిదే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరెన్సీ నోట్లు జారీ చేసినప్పుడు దాని వెనుక బంగారం నిల్వలు ఉండాలని.. బంగారం నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే మన కరెన్సీ విలువ అంత ఎక్కువగా పెరుగుతుందని.. ఎప్పుడైతే కరెన్సీ పెట్టుబడి పెడుతుందో అప్పుడు ఆదాయం అనేది పెరుగుతుందని ఆర్థిక రంగ నిపుణులు డాక్టర్ ఎం.సి. దాస్ అన్నారు. యూకే నుంచి 100 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ తరలించడమనేది స్వాగతించాల్సిన అంశమని అన్నారు. ఇతర దేశాల్లో కంటే భారత్ లో ఈ బంగారం ఉండడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని అన్నారు.  

Show comments