‘మా‘ నుండి హేమను తొలగించబోతున్నారా.. నటి కామెంట్స్ వైరల్

‘మా‘ నుండి హేమను తొలగించబోతున్నారా.. నటి కామెంట్స్ వైరల్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న అంశం బెంగళూరు రేవ్ పార్టీ ఘటన. ఇందులో నటి హేమ అడ్డంగా దొరికిపోయిన సంగతి విదితమే. తాజాగా బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయగా.. డ్రగ్స్ తీసుకున్నట్లు హేమకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న అంశం బెంగళూరు రేవ్ పార్టీ ఘటన. ఇందులో నటి హేమ అడ్డంగా దొరికిపోయిన సంగతి విదితమే. తాజాగా బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయగా.. డ్రగ్స్ తీసుకున్నట్లు హేమకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను..

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీలో పట్టుబడిన 150 మంది నుండి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయగా.. తెలుగు వాళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయ్యింది. అందులో తెలుగు నటి హేమకు కూడా పాజిటివ్ ఇచ్చింది. వీరందరికీ కౌన్సిలింగ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా, నటి హేమ తొలుత ఈ పార్టీలో తాను లేనంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. వెంటనే ఆమె ఉందని బెంగళూరు పోలీసులు పార్టీలో ఆమె ఉన్నట్లు నిర్దారించారు. ఆ వెంటనే మరో వీడియో రిలీజ్ చేసి ఇంట్లో ఉన్నట్లు కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కాగా తాజాగా బ్లడ్ శాంపిల్స్‌లో హేమతో పాటు ఆ పార్టీలో పాల్గొన్న 86 మందికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే..ఆమెను ఉతికి ఆరేసింది కరాటే కళ్యాణి. ఓ మనిషిని ఓ మాట అనే ముందు కర్మ రిటర్న్ అవుతుందని గుర్తుంచుకోవాలి అంటూ ఎద్దేవా చేసింది. అన్నింట్లో నేనున్నానని, అందరినీ నేనుద్దరిస్తున్నానని ప్రగల్బాలు పలికావని, ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ తో దొరికేశావంటూ కామెంట్స్ చేసింది. అలాగే మా అసోసియేషన్ ఎలక్షన్స్ సమయంలో శివబాలాజీ చేయి కొరికిన సంగతి, రాజేంద్రప్రసాద్‌ను అడ్డగించి సంగతి గుర్తు చేసింది. ఇప్పుడు శాంపిల్స్ రాగానే.. బెంగళూరు పోలీసులు పనిష్మెంట్ ఇస్తారని, తీసుకునేందుకు సిద్ధంగా ఉండు అని పేర్కొంది. కాగా, తాజాగా హేమ శాంపిల్స్ పాజిటివ్ రావడంతో మరోసారి స్పందించింది కరాటే కళ్యాణి. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణైన నేపథ్యంలో హేమ మా అసోసియేషన్ సభ్యత్వాన్ని తొలగిస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫ్రాన్స్ లో ఉన్న సంగతి విదితమే. కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతుండగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న కన్నప్ప చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఫ్రాన్స్ వెళ్లాడు మంచు విష్ణు. మంచు విష్ణు హైదరాబాద్ రాగానే హేమపై చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తామని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  ఇదిలా ఉంటే.. బెంగళూరులో సన్ రైజ్ టు సన్ సెట్ పేరుతో వాసు అనే వ్యక్తి రేవ్ పార్టీని నిర్వహించాడు. బర్త్ డే పార్టీ ముసుగులో  ఈ రేవ్ పార్టీని నిర్వహిస్తుండగా పోలీసులు రైడ్ చేయడంతో  150 మంది సినీ, రాజకీయ ప్రముఖులు పట్టుబడిన సంగతి విదితమే. వీరిలో  ఐదురుగు తెలుగు వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. వాసు, అతని సోదరుడు అరుణ్, చిరంజీవి, హేమ, మరో నటి ఆషీ రాయ్ పేర్లు వినిపించాయి.

Show comments