MS Dhoni Reveals His Success Secret: నా సక్సెస్ సీక్రెట్ అదే! దాని వల్లే నేను ఈ స్టేజ్​లో ఉన్నా: ధోని

MS Dhoni: నా సక్సెస్ సీక్రెట్ అదే! దాని వల్లే నేను ఈ స్టేజ్​లో ఉన్నా: ధోని

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్​ ధోనీని అందరూ ఫియర్​లెస్ క్రికెటర్ అని అంటుంటారు. డేరింగ్​గా డిసిషన్స్ తీసుకుంటాడని చెబుతుంటారు. కానీ మాహీ మాత్రం తనకు భయం ఎక్కువని అంటున్నాడు.

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్​ ధోనీని అందరూ ఫియర్​లెస్ క్రికెటర్ అని అంటుంటారు. డేరింగ్​గా డిసిషన్స్ తీసుకుంటాడని చెబుతుంటారు. కానీ మాహీ మాత్రం తనకు భయం ఎక్కువని అంటున్నాడు.

ఎంఎస్ ధోని.. ఈ పేరు చెప్పగానే అతడి కెప్టెన్సీనే అందరికీ గుర్తుకొస్తుంది. బ్యాటర్​గా కూడా ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు మాహీ. అయితే అతడి సారథ్యానికే ఎక్కువ మార్కులు పడ్డాయి. భారత జట్టుకు 2 వరల్డ్ కప్స్ అందించడం, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలపడంతో క్రికెట్ వరల్డ్​లో అతడి పేరు మార్మోగిపోయింది. ఐపీఎల్​లో సీఎస్​కేను ఐదుసార్లు ఛాంపియన్​గా నిలిపి ఆల్​టైమ్ గ్రేట్ కెప్టెన్స్​లో ఒకడిగా నిలిచాడు మాహీ. కెప్టెన్​గా దేనికీ భయపడకపోవడం, డేరింగ్ డిసిషన్స్ తీసుకోవడం వల్లే ఇవన్నీ అతడు సాధించాడని అంతా అంటుంటారు. అయితే ధోని మాత్రం తనకు భయం ఎక్కువన్నాడు. ఫియర్ వల్లే తాను ఈ స్టేజ్​లో ఉన్నానని చెప్పాడు.

‘ఎవరికైనా సరే భయం ఉండటం చాలా ముఖ్యం. భయపడటం మంచిదే. ఫియర్ లేకపోతే నాలోని తెలివితేటలు బయటకు రావు. భయపడతా కాబట్టే నేను తెలివిగా, మరింత ధైర్యంగా ఉండగలుగుతున్నా. భయం, ఒత్తిడిని నేను ఆస్వాదిస్తా. నా మటుకు ఆ రెండూ ఉండటం చాలా ముఖ్యం. కరెక్ట్‌ డిసిషన్స్ తీసుకోవడంలో ఇవి నాకు ఉపయోగపడతాయి. నాకు భయం లేదని చాలా మంది అంటుంటారు. నేను ఫియర్​లెస్​నని అనుకుంటారు. కానీ నాకు భయం ఎక్కువే. అది లేకపోతే మనం నిర్లక్ష్యంగా ఉంటాం. భయం లేకపోతే మనం దేన్నీ గౌరవించం. ఇలాంటి విషయాలన్నీ వ్యక్తిగతంగా మెరుగవ్వడానికి ఎంతో ఉపయోగపడతాయి’ అని ధోని చెప్పుకొచ్చాడు. సీఎస్​కే ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అతడీ కామెంట్స్ చేశాడు.

ఇక, ఐపీఎల్-2024లో ఫేవరెట్​గా బరిలోకి దిగింది చెన్నై సూపర్​కింగ్స్. సీజన్ ఫస్టాఫ్​లో వరుస విజయాలతో జోరు మీద కనిపించింది డిఫెండింగ్ ఛాంపియన్. దీంతో ఈసారి కూడా ఆ టీమ్​దే కప్పు అని అంతా అనుకున్నారు. అయితే సెకండాఫ్​లో సీన్ మారింది. గాయం కారణంగా కీలక ఆటగాళ్లు దూరమవడం, టీ20 వరల్డ్ కప్​ ప్రిపరేషన్స్​ వల్ల మరికొందరు వెళ్లిపోవడంతో సీఎస్​కే బలహీనపడింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయినా ఆఖర్లో పలు విజయాలతో రేసులోకి దూసుకొచ్చింది రుతురాజ్ సేన. కానీ నాకౌట్ మ్యాచ్​లో ఆర్సీబీ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టింది. మరోసారి సీఎస్​ను గెలిపిస్తాడని లెజెండ్ ధోనీపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ మాహీ ఎంత పోరాడినా టీమ్​ను కాపాడలేకపోయాడు.

Show comments