DC vs KKR Shah Rukh Khan Hug Rishabh Pant: పంత్ విధ్వంసక ఇన్నింగ్స్​.. షారుక్ ఏం చేశాడంటే..?

DC vs KKR: షారుక్ గొప్ప మనసు.. పంత్​ను ఆప్యాయంగా! హ్యాట్సాఫ్ కింగ్ ఖాన్!

చావును జయించి కమ్​బ్యాక్​ ఇచ్చిన రిషబ్ పంత్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఐపీఎల్-2024లో అతడు బ్యాట్​తో చెలరేగుతున్న తీరును ప్రశంసిస్తున్నారు.

చావును జయించి కమ్​బ్యాక్​ ఇచ్చిన రిషబ్ పంత్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఐపీఎల్-2024లో అతడు బ్యాట్​తో చెలరేగుతున్న తీరును ప్రశంసిస్తున్నారు.

చావును జయించి కమ్​బ్యాక్​ ఇచ్చిన రిషబ్ పంత్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఐపీఎల్-2024లో అతడు బ్యాట్​తో చెలరేగుతున్న తీరును ప్రశంసిస్తున్నారు. అతడు సారథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జయాపజయాల గురించి పక్కనబెడితే.. పం ఆడుతున్న తీరు గురించి మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పించ్ హిట్టర్.. బాల్​ను కసి తీరా బాదడం, వికెట్ల మధ్య చిరుతలా పరుగులు తీయడం, కీపింగ్​లోనూ తన మార్క్ చూపిస్తుండటంతో అందరూ ఫిదా అవుతున్నారు. పంత్ అస్సలు మారలేదని, ఎక్కడ ఆగాడో.. తిరిగి అక్కడి నుంచే కెరీర్​ను అంతే బాగా స్టార్ట్ చేశాడని అంటున్నారు. ఈ క్రమంలో కోల్​కతా నైట్ రైడర్స్ యజమాని కింగ్ ఖాన్ షారుక్ కూడా పంత్​ను మెచ్చుకోవడం హైలైట్​గా మారింది.

ఢిల్లీ-కోల్​కతా మధ్య విశాఖపట్నం వేదికగా బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముగిశాక పంత్​ను కలిశాడు షారుక్. అతడితో కొద్దిసేపు మాట్లాడాడు. రిషబ్​ను ఆప్యాయంగా హగ్ చేసుకున్న బాలీవుడ్ బాద్​షా అతడి చెవిలో ఏదో సీక్రెట్​ విషయాన్ని చెప్పాడు. బాగా ఆడావ్.. ఇలాగే కంటిన్యూ చెయ్ అంటూ చేతులతో సైగలు చేస్తూ ఎంకరేజ్ చేశాడు. వెళ్తూ వెళ్తూ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ సమయంలో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ కూడా అక్కడే ఉన్నాడు. షారుక్ మాట్లాడున్నంత సేపు శ్రద్ధగా విన్న పంత్.. మధ్య మధ్యలో నవ్వుతూ కనిపించాడు. రింకూ వీళ్లిద్దరి సంభాషణను సీరియస్​గా గమనించాడు. పంత్​ను షారుక్ కలవడం, అతడిని కౌగిలించుకోవడం, బాగా ఆడావంటూ ప్రోత్సహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ టైమ్​లోనూ పంత్​ను మెచ్చుకున్నాడు షారుక్. వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్​లో డీసీ కెప్టెన్ ఏకంగా 28 రన్స్ పిండుకున్నాడు. అదే ఓవర్​లో లెగ్ సైడ్ అద్భుతమైన ఫ్లిక్ షాట్ కొట్టాడు. పంత్ షాట్​కు ఫిదా అయిన కింగ్ ఖాన్ నిలబడి చప్పట్లతో అతడ్ని ఎంకరేజ్ చేశాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడు సిక్స్ కొడితే ఎవరూ చప్పట్లు కొట్టరు. కానీ ఘోర ప్రమాదం తర్వాత కమ్​బ్యాక్ ఇస్తున్న పంత్ టీమిండియాకు చాలా ముఖ్యం. అతడు ఫామ్​లోకి వస్తే టీ20 వరల్డ్ కప్​లో భారత్​కు చాలా కీలకం అవుతాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్​లో అతడు అదరగొడుతుండటంతో అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదే క్రమంలో షారుక్ కూడా అతడ్ని ప్రోత్సహించాడు. మ్యాచ్ తర్వాత అతడితో మాట్లాడి మరింత జోష్ నింపాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. రీఎంట్రీ ఇచ్చిన పంత్​ను కలవడం, హగ్ చేసుకోవడం, ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం ద్వారా షారుక్ తన గొప్ప మనసును చాటుకున్నాడని అంటున్నారు. మరి.. పంత్​ను షారుక్ ఎంకరేజ్ చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: పాండ్యా పనులతో విసిగిపోయిన ముంబై ఇండియన్స్‌! దెబ్బకి తీసి పారేసింది!

Show comments