iPhone 15 Pros Action Button-More Features: యాపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌లో మరిన్ని ఫీచర్లు..!

iPhone 15: యాపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌లో మరిన్ని ఫీచర్లు..!

ఐఫోన్‌ యూజర్లకు యాపిల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. యాపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌లో మరిన్ని ఫీచర్లు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

ఐఫోన్‌ యూజర్లకు యాపిల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. యాపిల్ ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌లో మరిన్ని ఫీచర్లు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

యాపిల్ ఫోన్ అంటే మన ఇండియన్స్ కి ఎక్కడ లేని పిచ్చి, అది చేతిలో ఉంటే ఏదో ప్రపంచాన్నే జయించిన ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది. యాపిల్ ఫోన్ వాడే వారు దాని లోగో అందరికీ కనిపించేలా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇఫోన్ యూజర్లకు అదిరిపోయే న్యూస్ ఇది, ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో కొత్త ఫీచర్లు వచ్చాయి. రీసెంట్ గా జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2024)లో ఐఓఎస్18 ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే ఐఫోన్ 15ప్రో యాక్షన్ బటన్‌ యూజర్ కి పనులు ఈజీ గా అయ్యేలా చేస్తుంది అని కూడా చెప్పారు.

ఈ యాక్షన్ బటన్ లో హోమ్, రిమోట్, స్టాప్‌వాచ్, కాలిక్యులేటర్ ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ తో సహా కస్టమైజడ్ యాక్షన్స్‌కు యాపిల్ స్పీడ్ యాక్సస్ ను అందిస్తుంది. ప్రస్తుతం, ఈ బటన్‌కు 9 ప్రీసెట్ ఆప్షన్లను పెట్టుకోవచ్చు, అయితే, త్వరలో డార్క్ మోడ్‌ను టోగుల్ చేయడం అలాగే హోమ్ యాప్ ద్వారా డివైజ్‌లను కంట్రోల్ చేయడం, పేమెంట్స్ కి ఫోన్ నే క్రెడిట్ కార్డు లాగ టాప్ చెయ్యడం వంటి మరిన్ని ఆప్షన్స్ ని అందిస్తుంది.

యాక్షన్ బటన్‌ ఫీచర్లు :

కొత్తగా రిలీజ్ చేసిన ఇండెక్స్ ప్రకారం, యాక్షన్ బటన్‌కు యాపిల్ 14 కొత్త కస్టమైజ్డ్‌ ఆప్షన్లను ప్రవేశపెట్టింది అది కూడా ఐఓఎస్ 18 డెవలపర్ బీటా 1తో. ప్రస్తుతం ఉన్న, ఐఓఎస్ 17 వాయిస్ మెమో, కెమెరా, టార్చ్, ట్రాన్స్‌లేట్, ఫోకస్, సైలెంట్ మోడ్, మాగ్నిఫైయర్, ఇలా యాక్సస్ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్లతో పాటు, యూజర్స్ అసలేం చెయ్యకుండా కూడా కంట్రోల్స్ హోల్డ్ లో పెట్టుకునేల చేయవచ్చు. ఐఫోన్ సెట్టింగ్‌లలో కొత్త ‘కంట్రోల్స్’ ఆప్షన్ ద్వారా ఇప్పటికే ఉన్న ఈ యాక్షన్స్ ఎక్ష్పాండ్ చెయ్యడానికి ఐఓఎస్ 18 కొత్త ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. అవి కాలిక్యులేటర్, అలారం, స్టాప్‌వాచ్, హోమ్, టైమర్, డార్క్ మోడ్, వాలెట్, సెల్యులర్ డేటా, ఫ్లైట్ మోడ్, స్కాన్ కోడ్, రిమోట్, పర్సనల్ హాట్ స్పాట్, ట్యాప్ టూ క్యాష్, పింగ్ మై వాచ్.

2023లో ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ఈ రెండు ఫోన్స్ తో ఈ యాక్షన్ బటన్‌ని మొట్ట మొదటి సారి ఆపిల్ ప్రవేశపెట్టింది. వాల్యూమ్ కంట్రోలింగ్ పైన ఉన్న మ్యూట్ స్విచ్‌ని కూడా రీప్లేస్ చేసేసింది. కానీ, ఐఫోన్ 15 మోడల్‌లలో ఈ యాక్షన్ బటన్ అందుబాటులో లేదు

ఐఫోన్ 16 యాక్షన్ బటన్‌కు ఫంక్షనాలిటీ మాత్రమే కాదు, యాపిల్ కంట్రోల్ సెంటర్ కంట్రోలింగ్ ఇంకా చాలా ఆప్షన్లను రిలీజ్ చేసింది’. మాములు ఇఫోనే భయట యాప్స్ వాడడానికి అనుమతి ఇవ్వదు కాని ఈ సారి 3rd (WWDC)లో iOS 18 యూజర్లను థర్డ్-పార్టీ అప్లికేషన్‌లలో కెమెరా ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. “Locked Camera Capture” పేరుతో డెవలపర్‌ల కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఈ ఫీచర్ అందిస్తున్నారు.

యాపిల్ ప్రకారం.. కెమెరాను లాక్ చేసినప్పుడు ఫొటోస్ వీడియోస్ ను త్వరగా క్యాప్చర్ చేందుకు యూజర్లను అనుమతిస్తుంది. అలాగే దీనికి ఎక్స్‌టెన్షన్ ని క్రియేట్ చేసేందుకు కూడా దీన్ని వాడొచ్చు. ఐఓఎస్18తో యూజర్లు మరిన్ని కంట్రోలింగ్, టోగుల్‌లతో స్వైప్ చేసుకోవచ్చు. కొత్త కంట్రోలింగ్ గ్యాలరీని కంట్రోలింగ్ సెంటర్‌కు కనెన్ట్ చేసే ఆప్షనలు పూర్తి జాబితాను డిస్‌ప్లే చేస్తుంది. త్వరలో అందరికీ అవి అందుబాటులోకి వస్తాయి.

Show comments