Inter Results 2024-Re Verification, Revaluation: ఇంటర్‌ పేపర్ల వాల్యువేషన్‌లో ఘోర తప్పిదం.. 97 మార్కులు వస్తే 77 వేశారు

ఇంటర్‌ పేపర్ల వాల్యువేషన్‌లో ఘోర తప్పిదం.. 97 మార్కులు వస్తే 77 వేశారు

TS Intermediate Board: ఇంటర్‌ పరీక్షల పేపర్ల వాల్యువేషన్‌లో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తు‍న్నాయి. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

TS Intermediate Board: ఇంటర్‌ పరీక్షల పేపర్ల వాల్యువేషన్‌లో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తు‍న్నాయి. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..

ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయి. తాజాగా రీవాల్యువేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో పరీక్ష పత్రాల మూల్యంకనంలో అధికారులు నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది. రీవెరిఫికేషన్‌లో వారి బాగోతం బహిర్గతమైంది. దాంతో విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడతారా.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. నూటికి 99, 98, 97 మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా తక్కువ మార్కులు వేశారు. కనీసం వారు ఏం జవాబు రాశారో కూడా చూడకుండా.. తమకు ఎంత తోస్తే.. అన్ని మార్కులు వేసి.. మమా అనిపించుకున్నారు అధికారులు. కొందరైతే టోటల్‌ కౌంట్‌లో పొరపాట్లు చేశారు. దాంతో చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. తాజాగా రీవెరిఫికేషన్‌ ఫలితాల్లో ఈ తప్పిదాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంటర్‌ మార్కులు వెల్లడి తర్వాత.. రిజల్ట్‌ విషయంలో ఏవైనా అనుమానాలుంటే.. రీవెరిఫికేషన్‌కు అప్లై చసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. దాంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు అప్లై చేసుకున్నారు. సుమారు 48 వేల మంది రీవెరిఫికేషన్‌కు అప్లై చేయగా.. 2 వేల మంది రీవాల్యువేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇక రీవెరిఫికేషన్‌కు అప్లై చేసుకున్న విద్యార్థులు.. వెబ్‌సైట్‌ నుంచి తన ఆన్సర్‌ షీట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని చూసుకుని షాక్‌ అవుతున్నారు. ఇంటర్‌ బోర్డు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలో వారు ఎక్కువ మార్కులు సాధించినా.. అధికారులు నిర్లక్ష్యం వల్ల.. రిజల్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయి.

హైదరాబాద్‌ జిల్లాకు చెందని ఎంఈసీ విద్యార్థిని ఒకరికి మొత్తం 926 మార్కులు వచ్చాయి. కానీ సెకండియర్‌ కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ పేపర్‌లో 100కు 77 వచ్చాయి. ఆమె అనుకున్న లెక్క ప్రకారం.. 95 వరకు అయినా వస్తాయని భావించింది. అందుకు భిన్నంగా కేవలం 77 మార్కులు మాత్రమే వచ్చాయి. దాంతో ఆమె రీవెరిఫికేషన్‌కు అప్లై చేసుకుని.. జవాబు పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంది. ఈక్రమంలో ఆమె పేపర్‌ కరెక్షన్‌ చేసిన టీచర్‌.. ముందు ఆమెకు 97 మార్కులు వేసి.. తర్వాత 77గా మార్చినట్లు అర్థం అవుతోంది. అలానే ఎంపీసీ విద్యార్థి ఒకరికి లాంగ్వేజెస్‌లో ఒక సబ్జెక్ట్‌లో 21 మార్కులు వచ్చాయి. దాంతో రీవెరిఫికేషన్‌కు అప్లై చేయగా.. పరిశీలనలో ఏకంగా 91 మార్కులు దక్కాయి.

దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక పేపర్‌ వాల్యువేషన్‌ జరిగిన విధానాన్ని చూసి ఇంటర్‌ బోర్డు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Show comments