Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త! మూడు నెలల్లో..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త! మూడు నెలల్లో..

Indiramma Housing Scheme: ఇటీవలే దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. దీంతో దాదాపు రెండున్నర నెలల పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్  అమల్లో ఉంది. ఇలా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు గుడ్ న్యూస్ అందించింది.

Indiramma Housing Scheme: ఇటీవలే దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. దీంతో దాదాపు రెండున్నర నెలల పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్  అమల్లో ఉంది. ఇలా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు గుడ్ న్యూస్ అందించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుంటాయి. అంతేకాక ప్రజలకు ముఖ్యమైన కొన్ని అంశాల విషయంలో కసరత్తు చేస్తుంటాయి. ఇదే సమయంలో పలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు లబ్ధి పొందేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలానే తెలంగాణలో కూడా ప్రభుత్వం అందించే ఇళ్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవలే దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. దీంతో దాదాపు రెండున్నర నెలల పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్  అమల్లో ఉంది. జూన్ 4 వ తేదీన ఫలితాలు వెలువడటంతో కొన్ని రోజుల తరువాత ఎన్నికల కోడ్ ముగిసింది. ఇలా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనపై దృష్టి పెట్టింది. అంతేకాక ఈ అంశంపై అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినే స్వయంగా ఈ ఇళ్ల విషయం గురించి ప్రస్తావించారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభిస్తానని తెలిపారు.

మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అమలు చేసేందుకు విధివిధానాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో  అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది.

ఏటా 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన అయిదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇదే సమయంలోఈ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించే విధంగా అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో సిద్ధమైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో కొన్నింటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా మరో మూడు నెలల్లో ఈ ఇదిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నో నెలల నుంచి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శుభవార్తే అని చెప్పాలి.

Show comments