టీమిండియా గెలుస్తున్నా.. భయపడుతున్న ఇండియన్‌ ఫ్యాన్స్‌! గతంలో ఎన్నడూ లేని విధంగా..!

టీమిండియా గెలుస్తున్నా.. భయపడుతున్న ఇండియన్‌ ఫ్యాన్స్‌! గతంలో ఎన్నడూ లేని విధంగా..!

Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ సేన వరుసబెట్టి మ్యాచ్‌లు గెలుస్తున్నా.. భారత క్రికెట్‌ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ సేన వరుసబెట్టి మ్యాచ్‌లు గెలుస్తున్నా.. భారత క్రికెట్‌ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా వరుసగా మూడో విజయం సాధించింది. బుధవారం పసికూన యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది రోహిత్‌ సేన. అంతకంటే ముందు ఐర్లాండ్‌, పాకిస్థాన్‌ ఓడించిన విషయం తెలిసిందే. ఇలా వరుస విజయాలు సాధిస్తున్నా.. 100 కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానులు ఒక్క విషయంలో భయపడుతున్నారు. గతంలో చాలా వరల్డ్‌ కప్‌లు చూసినా గతంలో ఎన్నడూ ఇలాంటి భయం భారత క్రికెట్‌ అభిమానుల్లో కనిపించలేదు. మరి వారి భయానికి కారణం ఏంటి? జట్టు గెలుస్తున్నా ఎందుకు అంతలా భయపడుతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కారణం విరాట్‌ కోహ్లీ వైఫల్యం. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు బ్యాటింగ్‌లో ప్రధాన బలంగా ఉన్న విరాట్‌ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలం అయ్యాడు. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4, యూఎస్‌ఏపై 0 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. గతంలో ఏ వరల్డ్‌ కప్‌లోనూ విరాట్‌ కోహ్లీ ఇంత దారుణంగా విఫలం కాలేదు. కోహ్లీ వరుస వైఫల్యాలు ఇప్పుడు అభిమానులకే వణుకుపుట్టిస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ ఫామ్‌లో లేకుండా టోర్నీలోని రాబోయే మ్యాచ్‌ల్లో గెలవడం అసాధ్యం అంటున్నారు అభిమానులు. ఇప్పుడు గ్రూప్‌ స్టేజ్‌లో చిన్న టీమ్స్‌తో మ్యాచ్‌లు, బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బౌలర్ల అండతో గెలుస్తున్నామని.. కానీ, సూపర్‌ 8లో ఆస్ట్రేలియా లాంటి టీమ్స్‌తో మ్యాచ్‌ ఉందని, ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే కోహ్లీ ఫామ్‌లోకి రావడం ఎంతో ముఖ్యం అంటున్నారు.

2011 నుంచి జరిగిన ప్రతి వరల్డ్‌ కప్‌లోనూ అది వన్డే వరల్డ్‌ కప్‌ అయినా టీ20 వరల్డ్‌ కప్‌ అయినా కోహ్లీ బ్యాటింగ్‌లో ముందుండి టీమిండియాను నడిపించేవాడు. ఏ వరల్డ్‌ కప్‌లోనూ విరాట్‌ కోహ్లీ విఫలమైంది. లేదు ఒక్క 2015 వన్డే వరల్డ్‌ కప్‌లోనే కోహ్లీని రోహిత్‌ శర్మ పూర్తిగా డామినేట్‌ చేశారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో కూడా విరాట్‌ కోహ్లీ 765 పరుగులు చేసి టోర్నీ టాప్‌ రన్‌ గెట్టర్‌గా నిలిచాడు. అలాంటి కోహ్లీ ఇప్పుడు ఈ టీ20 వరల్డ్‌ కప్‌లోని తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలం కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే బ్యాడ్‌ ఫామ్‌ కంటీన్యూ అయితే.. సూపర్‌ 8 దశలో టీమిండియాను ఎవరు ఆదుకుంటారు? కోహ్లీ ఫామ్‌లో లేకుంటే ఈ వరల్డ్‌ కప్‌ గెలవడం కష్టమే అంటూ భారత క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments