IND vs ENG Rohit Sharma Met Sarfaraz Father: వీడియో: సర్ఫరాజ్ ఫ్యామిలీని కలసిన రోహిత్.. నౌషద్ ఖాన్ ఎమోషనల్!

IND vs ENG వీడియో: సర్ఫరాజ్ ఫ్యామిలీని కలసిన రోహిత్.. నౌషద్ ఖాన్ ఎమోషనల్!

టీమిండియా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ ఫ్యామిలీని కెప్టెన్ రోహిత్ శర్మ కలిశాడు. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్​తో హిట్​మ్యాన్ కాసేపు ముచ్చటించాడు.

టీమిండియా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ ఫ్యామిలీని కెప్టెన్ రోహిత్ శర్మ కలిశాడు. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్​తో హిట్​మ్యాన్ కాసేపు ముచ్చటించాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్​కు పనికి రాడన్నారు. ఓవర్ వెయిట్ ఉన్నాడు ఆడటం కష్టమన్నారు. ఓపిక లేదు ఇలాంటోడికి ఛాన్స్ ఇచ్చినా వేస్టే అన్నారు. కానీ అతడు ఎంతో పేషెన్స్​తో ఆడుతూ వచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియా తలుపులను తట్టడం కాదు.. ఏకంగా బద్దలు కొట్టేశాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. సింహంలా గర్జించి.. సెన్సేషనల్ ఇన్నింగ్స్​తో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు. అతడే సర్ఫరాజ్ ఖాన్. ఇంగ్లండ్​తో రాజ్​కోట్​ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సంచలన ఇన్నింగ్స్​తో చెలరేగాడతను. 66 బంతుల్లో 62 పరుగులు చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు సర్ఫరాజ్. క్రికెట్​ను దున్నేయడానికి వచ్చానని సగర్వంగా చాటిచెప్పాడు. అతడి బ్యాటింగ్​పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ యంగ్ బ్యాటర్ ఫ్యామిలీని కెప్టెన్ రోహిత్ శర్మ కలవడం ఇంట్రెస్టింగ్​గా మారింది.

సర్ఫరాజ్ తండ్రి నౌషద్​ ఖాన్​తో పాటు అతడి భార్యను కూడా కలిశాడు రోహిత్ శర్మ. వాళ్లకు షేక్ హ్యాండ్స్ ఇచ్చి కాసేపు ముచ్చటించాడు. సర్ఫరాజ్ కోసం వాళ్లు పడిన కష్టం ఏంటో అందరికీ తెలుసునని చెప్పాడు. ‘సర్ఫరాజ్ ఈ స్థాయికి రావడం కోసం మీరు పడిన కష్టం ఏంటో అందరికీ తెలుసు. మీరు ఎన్ని త్యాగాలు చేశారో, ఎన్ని కష్టాలు పడ్డారో ప్రతి ఒక్కరికీ తెలుసు. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు’ అని రోహిత్ అభినందనలు తెలిపాడు. ఆ సమయంలో సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. ‘నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నా. జాగ్రత్తగా చూసుకోండి’ అని అన్నారు. దీంతో హిట్​మ్యాన్ ఏం ఫర్లేదని.. తాను చూసుకుంటానని ఆయనకు ధైర్యం చెప్పాడు. వీళ్ల సంభాషణకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సర్ఫరాజ్ తండ్రిని రోహిత్ కలవడం, వారితో మాట్లాడిన వీడియోలు చూసిన నెటిజన్స్ అతడ్ని మెచ్చుకుంటున్నారు. సర్ఫరాజ్ కోసం వాళ్ల ఫ్యామిలీ పడిన కష్టం, త్యాగాన్ని హిట్​మ్యాన్ గుర్తించి వారిని అభినందించడం మంచి విషయమని అంటున్నారు. ఇది అతడి మంచి మనసుకు నిదర్శనమని.. ఒక కెప్టెన్​గా ప్లేయర్​కు, అతడి ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వడం సూపర్బ్ అని కామెంట్స్ చేస్తున్నారు. సర్ఫరాజ్​ను మీరే చూసుకోవాలంటూ నౌషద్ ఖాన్ ఎమోషనల్ అవడం మీదా నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. తండ్రిగానే గాక కోచ్​గానూ ఇన్నాళ్లూ సర్ఫరాజ్​ను ఆయన ముందుండి నడిపించారని.. కానీ ఇప్పుడు టీమ్ మేనేజ్​మెంట్, సారథి రోహిత్ చూసుకోవాలి కాబట్టి ఆయన హిట్​మ్యాన్​ను అలా రిక్వెస్ట్ చేశారని అంటున్నారు. కొడుకు ఎంత ఎదిగినా తండ్రికి ఉండే భయం, ప్రేమ, ఇష్టం ఏంటో చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ అని చెబుతున్నారు. మరి.. సర్ఫరాజ్ తండ్రికి రోహిత్ ధైర్యం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Sarfaraz Khan: రోహిత్‌ మాస్టర్‌ ప్లాన్‌తో సర్ఫరాజ్‌ సూపర్‌ సక్సెస్‌! ఆ ఒక్క ఐడియాతో..

Show comments