SKY సూపర్ ఇన్నింగ్స్.. కానీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు!

SKY సూపర్ ఇన్నింగ్స్.. కానీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు!

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి.. జట్టుకు విజయాన్ని అందించాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఈ క్రమంలోనే ఓ చెత్త రికార్డును కూడా నమోదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి.. జట్టుకు విజయాన్ని అందించాడు సూర్యకుమార్ యాదవ్. అయితే ఈ క్రమంలోనే ఓ చెత్త రికార్డును కూడా నమోదు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలతో సూపర్ 8కు అర్హత సాధించింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో అమెరికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది భారత జట్టు. ఇక ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. తన శైలికి భిన్నంగా, పరిస్థితులకు తగ్గట్లుగా ఆడి టీమ్ ను విజయతీరాలకు చేర్చాడు. సూపర్ ఫిఫ్టీతో ఆకట్టుకున్న స్కై.. అద్బుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటి ఫిఫ్టీతో టీమ్ ను గెలిపించాడు కదా? చెత్త రికార్డు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓ దశలో 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(3), విరాట్ కోహ్లీ(0), రిషబ్ పంత్(18) పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చాడు మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. శివమ్ దూబే తో జతకలిసిన స్కై.. అమెరికా బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్ లో పరిస్థితులకు తగ్గట్లుగా, తన శైలికి విరుద్దంగా బ్యాటింగ్ చేశాడు సూర్య. ఇది అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ అక్కడున్న పరిస్థితులు వేరు. అందుకే అలా ఆడాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఓవరాల్ గా 49 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఇది అద్భుతమైన ఇన్నింగ్సే అయినప్పటికీ.. గణాంకాల పరంగా ఓ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు స్కై. అదేంటంటే? టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 50 పరుగులు సాధించడానికి ఎక్కువ బంతులు(49) తీసుకున్న 5వ ప్లేయర్ గా వరస్ట్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. ఈ చెత్త రికార్డు జాబితాలో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్(52 బంతులు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత వరుసగా డేవిడ్ మిల్లర్(50 బాల్స్), డెవాన్ స్మిత్(49 బాల్స్), డేవిడ్ హస్సీ(49 బంతులు) ఉన్నారు. వీరితోపాటు తాజాగా సూర్యకుమార్ లిస్ట్ లో చేరాడు. మరి సూపర్ ఫిఫ్టీ సాధించినా.. స్కై చెత్త రికార్డ్ నెలకొల్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments