IMD Rain Alert To AP & Telangana:తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన కురుస్తుందని తెలిపింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ వివరాలు..

వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన కురుస్తుందని తెలిపింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ వివరాలు..

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రతి సారి వేసవిలో ఎండలు తక్కువగా ఉండాల్సిన మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సారి మాత్రం భానుడు భగభగ మండిపోయాడు. ఇక వేసవి తీవ్రత అధికంగా ఉండాల్సిన మే నెలలో మాత్రం కొన్ని రోజులు మండే ఎండలు.. మరి కొన్ని రోజులు వర్షాలతో చల్లబడుతూ విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఇక మే నెల ప్రారంభంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవగా.. మరో వారం రోజుల పాటు ఎండలు మండిపోయాయి. ఇక గురువారం సాయంత్రం ఏపీ, తెలంగాణలో జోరు వానలు కురిశాయి. భాగ్యనగరం అయితే తడిసి ముద్దయ్యింది. జనాలు ఎవరు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటుంది వాతావరణశాఖ. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగడమే కాక.. లక్షద్వీప్‌ వరకు ఇది విస్తరించి ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు అనగా శుక్రవారం నాడు కూడా వర్షం పడే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని.. చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు.

ఇక తెలంగాణలో కూడా నేడు అక్కడకక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావణ శాఖ అంచాన వేసింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడతాయని వెల్లడించింది. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతోనే తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నేడు హైదరాబాద్‌ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక గురువారం భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Show comments