అధిక వడ్డీ కావాలా? 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి 10 లక్షలు.. బెస్ట్ స్కీమ్ ఇదే

అధిక వడ్డీ కావాలా? 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి 10 లక్షలు.. బెస్ట్ స్కీమ్ ఇదే

మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీ పెట్టుబడి డబుల్ చేసే అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. అందులో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు అందుకోవచ్చు.

మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీ పెట్టుబడి డబుల్ చేసే అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. అందులో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు అందుకోవచ్చు.

ఫ్యూచర్ లో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకూడదంటే ప్రస్తుతం సంపాదించినదాంట్లో కొంత పొదుపు చేస్తే మేలు. పొదుపు చేసేందుకు అందుబాటులో ఉన్న పథకాలేంటబ్బా అని ఆరాతీస్తున్నారు జనాలు. డబ్బు సంపాదించేందుకు ఉన్న డబ్బును రెట్టింపు చేసుకునేందుకు ఆలోచిస్తున్నారు. పెట్టిన పెట్టుబడిపై అధిక వడ్డినిచ్చే స్కీంల కోసం చూస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ కాబట్టి ప్రభుత్వ రంగానికి చెందిన పథకాల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. మరి మీరు కూడా అధిక వడ్డీనిచ్చే పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే టైమ్ డిపాజిట్ స్కీం అందుబాటులో ఉంది. ఇందులో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కాలానికి చేతికి 10 లక్షలు అందుకోవచ్చు.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో 10 సంవత్సరాల వయసు నిండిన వారు పొదుపు చేయొచ్చు. ఈ స్కీమ్స్ లో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్స్ ఉంటాయి. ఈ స్కీమ్ లో కనీసం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. మైనర్ల తరపున వారి తల్లిదండ్రులు, సంరక్షకులు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా తెరవొచ్చు. ఈ పథకంలో ఏడాది టైమ్ డిపాజిట్ పై 6.8 శాతం వడ్డీ ఇస్తోంది కేంద్రం. రెండేళ్ల టైమ్ డిపాజిట్లకు 6.9 శాతం, మూడేళ్లకు 7 శాతం, 5 ఏళ్లకు 7.5 శాతం వడ్డీ రేట్లు ఇస్తోంది. ఇందులో వచ్చే వడ్డీ రాబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపుపొందొచ్చు.

5 లక్షలకు.. 10 లక్షలు

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో ఐదేళ్ల కాలానికి రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.5 శాతం వడ్డీ రేటుతో వడ్డీ రూపంలో రూ. 2,24,974 అందుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 7,24,149 పొందొచ్చు. అయితే మీరు ఈ మెచ్యూరిటీ మొత్తాన్ని తీసుకోకుండా మరో ఐదేళ్లు కొనసాగిస్తే.. అప్పుడు మీకు రూ. 5,51,175 వడ్డీ లభిస్తుంది. అంటే పదేళ్ల తర్వాత మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. అంటే మీరు పదేళ్ల మెచ్యూరిటీ తర్వాత రూ. 10,51,175 పొందొచ్చు.

Show comments