iDreamPost

జేబుకు చిల్లు పెడితే పీడి యాక్ట్ – మంత్రి కొడాలి నాని

జేబుకు చిల్లు పెడితే పీడి యాక్ట్ – మంత్రి కొడాలి నాని

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృభించి జనజీవనం స్థంభించి, ప్రజలందరు ఆందోళకు గురౌతున్న వేళ ఇదే అదునుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారస్తులు నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలను అమాంతం పెంచి వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టే ప్రయత్నం చేస్తే సదరు వ్యాపారస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. నిత్యవసర వస్తువులు, కూరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే రాష్ట్రం అంతా లాక్ డౌన్ లో ఉండగా , కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రభుత్వం నిబంధనలు కఠినంగా అమలు చేస్తుంది. అయిత ఇదే అందనుగా అనేక మంది వ్యాపారులు నిత్యవసర వస్తువులు, కురగాయల ధరలను అమాంతం పెంచి జేబులకి చిల్లు పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రమంత నిర్భంధం ఉన్న ఇలాంటి విపత్కర సమయంలో కూడా వ్యాపారస్తులు ఇలా దారుణంగా కాసులకి కక్కుర్తిపడటం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం వినియోగదారులకి అండగా ఉంటు ఇటువంటి ధన ధాహం ఉన్నవారిని ఉపేక్షించకూడదు అని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు టీ.విలో , పత్రికల్లో ప్రకటించాలని జిల్లా కలక్టర్లకు ఆదేశించింది.ఎవరైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా మంత్రి మాట్లాడుతు ప్రభుత్వ నిభందనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యాపారులపై పీడి యాక్ట్ పెట్టి జైలుకి సైతం పంపిస్తాం అని హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి