ఇంగ్లండ్‌ను ఇంటికి పంపేందుకు ఆసీస్‌ కావాలని ఓడిపోతే.. నిషేధం తప్పదు!

ఇంగ్లండ్‌ను ఇంటికి పంపేందుకు ఆసీస్‌ కావాలని ఓడిపోతే.. నిషేధం తప్పదు!

AUS vs SCT, England, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కావాలిన అలా చేస్తే నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

AUS vs SCT, England, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కావాలిన అలా చేస్తే నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో చిన్న టీమ్స్‌ చిచ్చరపిడుగుల్లా చెలరేగితే.. కొన్ని పెద్ద టీమ్స్‌ చతికిలపడ్డాయి. న్యూజిలాండ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లు గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటి బాటపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇంగ్లండ్ కూడా పరిస్థితి కూడా డేంజర్‌లోనే ఉంది. గ్రూప్‌-బీలో ఉన్న ఇంగ్లండ్‌ సూపర్‌ 8కు చేరాలంటే చాలా సమీకరణాలు కలిసి రావాలి. గ్రూప్‌ బీ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సూపర్‌ 8కు అర్హత సాధించింది. మిగిలిన ఒక్క స్థానం కోసం స్కాట్లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లు పోటీ పడుతున్నాయి. అయితే.. ఇంగ్లండ్‌ను సూపర్‌ 8కు రాకుండా అడ్డుపడుతూ, ఆ టీమ్‌ను ఇంటికి పంపాలని ఆస్ట్రేలియా ఉద్దేశపూర్వకంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ ఆడితే ఆ జట్టు కెప్టెన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించే ప్రమాదం ఉంది. అసలు ఉద్దేశపూర్వకంగా ఓడిపోవాలి, లేదా స్కాట్లాండ్‌ రన్‌రేట్‌పై ప్రభావం పడకుండా తక్కువ మార్జిన్‌తో గెలవాలని ఆస్ట్రేలియా ఎందుకు భావిస్తుంది? అసలు ఇంగ్లండ్‌పై ఆసీస్‌కు అంత కోపం ఎందుకు? ఈ చర్చ ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌లో ఏ జట్టు కూడా కావాలని ఓడిపోదు. అలా చేస్తే దాన్ని ఫిక్సింగ్‌గా పరిగణిస్తారు. అయితే.. ఇంగ్లండ్‌ సూపర్‌ 8కు రాకుండా ఉండాలంటే ఆస్ట్రేలియా చేతుల్లో ఉందని, స్కాట్లాండ్‌పై ఆసీస్‌ ఇలా గెలిస్తే చాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టిమ్‌ పైన్‌ అన్నాడు. అతను మాట్లాడుతూ.. ‘నేను ఇది జోక్‌గా అనడం లేదు. ఆసీస్‌ తప్పకుండా తారుమారు చేయాలి. అలాగని ఆసీస్‌ ఓడిపోవాలని నేను అనడం లేదు. కానీ, స్కాట్లాండ్‌ను చిత్తుగా ఓడించకుంటే చాలు.’ అని పైన్‌ అన్నాడు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. అంటే ఇంగ్లండ్‌ను ఇంటికి పంపేందుకు స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆసీస్‌ కావాలనే తక్కువ తేడాతో గెలుస్తుందా? అని క్రికెట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అదే కనుక జరిగి.. ఐసీసీ విచారణ జరిపి ఆసీస్‌ కావాలనే అలా ఆడిందని తేలితే మాత్రం ఆ జట్టు కెప్టెన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం, అలాగే ఇంకా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఆర్టికల్‌ 2.11 ప్రకారం ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు. అసలు గ్రూప్‌-బీలో ఏ టీమ్‌ ఏ పొజిషన్‌లో ఉంది. ఎవరికి సూపర్‌ 8కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మూడుకి మూడు మ్యాచ్‌లు గెలిచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయింది. 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక మ్యాచ్‌ రద్దు కావడంతో స్కాట్లాండ్‌ 5 పాయింట్లు +2.164తో రెండో స్థానంలో ఉంది. నమీబియా, ఒమన్‌ జట్లు ఇప్పటికే ఎలిమినేట్‌ అయిపోయాయి. ఇంగ్లండ్‌తో ఆ రెండు టీమ్స్‌కు ఒక్కో మ్యాచ్‌ మిగిలి ఉంది. ఆ రెండు టీమ్స్‌ ఆ మ్యాచ్‌లు నామమాత్రమే అయినా.. ఇంగ్లండ్‌ చాలా కీలకం. ఇంగ్లండ్‌ 2 మ్యాచ్‌ల్లో ఒక ఓటమి, ఒక మ్యాచ్‌ రద్దుతో కేవలం ఒక్క పాయింట్‌తో -1.800 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది.

ఇంగ్లండ్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవాలి, అలాగే స్కాట్లాండ్‌, ఆస్ట్రేలియాపై భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు స్కాట్లాండ్‌, ఇంగ్లండ్‌ ఐదేసి పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఎవరి రన్‌రేట్‌ మెరుగ్గా ఉంటే వాళ్లు సూపర్‌ 8కు అర్హత సాధిస్తారు. మరి ఆస్ట్రేలియా ఫెయిర్‌ క్రికెట్‌ ఆడుతుందా? లేదా పైన్‌ చెప్పినట్లు తొండాట ఆడుతుందా చూడాలి. ఇంగ్లండ్‌ భవిష్యత్తు ఇప్పుడు ఆసీస్‌ చేతుల్లోనే ఉంది. ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఓడినా, లీస్ట్‌ మార్జిన్‌తో గెలిచినా.. స్కాట్లాండ్‌ సూపర్‌ 8కు వెళ్తుంది. ఇంగ్లండ్‌ తమ రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా, వర్షం వల్ల ఒక్క మ్యాచ్‌ రద్దు అయినా, తక్కువ మార్జిన్‌తో నెగ్గినా.. గ్రూప్‌ స్టేజ్‌ నుంచి ఇంటికి వెళ్తుంది. మరి ఏ జరుగుతుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments