HYDవాసులకు పోలీసులు హెచ్చరిక.. 'ధార్' అనే క్రూరమైన దొంగల ముఠా సంచారం!

HYDవాసులకు పోలీసులు హెచ్చరిక.. ‘ధార్’ అనే క్రూరమైన దొంగల ముఠా సంచారం!

ఈ మధ్య కాలం చెడ్డి గ్యాంగ్,చుడ్డిదార్ గ్యాంగ్ అంటూ పలు రకాల దొంగల ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల చోరీలు, హత్యలు జరగ్గా.. మరో ముఠా హల్ చల్ చేస్తుంది.

ఈ మధ్య కాలం చెడ్డి గ్యాంగ్,చుడ్డిదార్ గ్యాంగ్ అంటూ పలు రకాల దొంగల ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల చోరీలు, హత్యలు జరగ్గా.. మరో ముఠా హల్ చల్ చేస్తుంది.

ఈమధ్యకాలంలో దొంగలు బాగా పెరిగిపోయారు. ముఖ్యంగా చెడ్డి గ్యాంగ్,చుడ్డిదార్ గ్యాంగ్ అంటూ పలు రకాల దొంగల ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల చోరీలు, హత్యలు జరగ్గా.. మరో ముఠా హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతాల్లో ఓ  దొంగల ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నగర శివార ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నరు

హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్, రాచకొండ కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో ధార్ అనే భయంకరమైన దొంగల ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం. రాత్రి సమయంలో నగర శివారు ప్రాంతంలో ఈ ముఠా తీరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే  ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ కీలక సూచనలు చేశారు. ఆయన ప్రజలకు కీలక సూచనలు చేస్తూ…రాత్రి సమయంలో హయత్ నగర్ పరిసర ప్రాంతాలలో “ధార్” అనే భయంకరమైన దొంగల ముఠా సంచరిస్తున్నట్లు ఆనవాళ్ల సమాచారం ఉందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ కి చెందిన కొందరు దొంగల ముఠాగా ఏర్పడిందని తెలిపారు.

ఈ ముఠా పట్టణ శివారు ప్రాంతాలలో, చిన్న చిన్న లాడ్జిల్లో తాత్కాలికంగా నివాసం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ కి చెందిన వ్యక్తులు పగటి పూట రెక్కీ నిర్వహణ చేసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లను, నగర శివారు ప్రాంతాల్లో నివసించే ఇళ్లను అలాగే గేటెడ్ కమ్యూనిటీ లో నివసించే విల్లాలు, అపార్ట్మెంట్ లను టార్గెట్ చేసుకుంటారు. పగటి పూట షేరింగ్ ఆటోలో తిరుగుతూ పరిశీలన చేసి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతుంటారు. ఇక చోరీ చేసే సమంలో మెయిన్ గేట్ నుంచి రాకుండా కాంపౌండ్ వాళ్ళు దూకి ఇంటి మెయిన్ డోర్ కొట్టి డోర్ కొడతారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వ్యక్తులపై దాడి చేసి., అవసరమైతే హత్య చేసి ఇళ్లలో ఉన్న బంగారు నగలు ఇతర విలువైన వస్తువులు దోచుకొని వెళ్తారని సీఐ పేర్కొన్నారు.

ఈనేపథ్యంలో ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎవరైనా గుర్తుతెలియని వారు రాత్రి సమయంలో ఇంటి తలుపు తడితే ఎట్టి పరిస్థితుల్లో తీయవద్దని డయల్ 100 ద్వారా ఇబ్రహీంపట్నం పోలీస్ వారికీ సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. అలానే వ్యక్తుల్ని కిటికీలోంచి చూసి మీ చుట్టుపక్కల వారికి అప్రమత్తం చేయాలని తెలిపారు. అలాగే మీ కాలనీలోకి వచ్చి.. వింత వ్యక్తులు, అలానే అనుమానంగా ఎవరైనా సంచరిస్తుంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వగలని తెలిపారు. గతంలో కూడా చెడ్డి గ్యాంగ్, చుడ్డీదార్ గ్యాంగ్ వంటివి విజయవాడ, హైదరాబాద్ లో సంచరించాయి. తాజాగా ఈ ధార్ అనే కొత్త ముఠా కారణంగా జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show comments