Hyderabad Nagole Woman Protest Against Damaged Roads: నడి రోడ్డుపై మహిళ ఒంటరి పోరాటం.. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్‌

Hyderabad: నడి రోడ్డుపై మహిళ ఒంటరి పోరాటం.. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్‌

సమస్యలు వస్తే.. చాలా మంది సర్దుకుపోతారు.. లేదంటే అలవాటు చేసుకుంటారు. కానీ కొందరు మాత్రమే వాటి పరిష్కరానికి ముందడుగు వేస్తారు. తాజాగా ఓ మహిళ.. అలా ఒంటరి పోరాటానికి రెడీ అయ్యింది. ఇంతకు దేని కోసం అంటే..

సమస్యలు వస్తే.. చాలా మంది సర్దుకుపోతారు.. లేదంటే అలవాటు చేసుకుంటారు. కానీ కొందరు మాత్రమే వాటి పరిష్కరానికి ముందడుగు వేస్తారు. తాజాగా ఓ మహిళ.. అలా ఒంటరి పోరాటానికి రెడీ అయ్యింది. ఇంతకు దేని కోసం అంటే..

మన చుట్టూ నిత్యం ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరుగుతుంటాయి. మన కళ్ల ముందే అన్యాయం జరిగినా.. మనకెందుకులే లేనిపోని తలనొప్పి అని పట్టించుకోకుండా ముందుకు సాగుతాం. ఇక కొందరైతే.. అన్యాయాన్ని ఎదిరించాల్సింది పోయి.. రోడ్డు మీద నిల్చుని వినోదం చూస్తుంటారు. కుదిరితే మొబైల్‌లో రికార్డ్‌ చేసి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. అక్కడికే తాము ఏదో సమాజాన్ని ఉద్దరించినట్లు ఫీలవుతారు. ఇక ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే చాలా మంది భయంతో వణికిపోతారు. అదుగో అలంటి వారందరికి ఈ మహిళ ఎంతో ఆదర్శం. తనతో ఎవరూ రాకున్నా.. అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఒక్కతే రంగంలోకి దిగింది. ఆమె ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకు ఆ మహిళ పోరాటం దేని కోసం అంటే..

భాగ్యనగరం హైదరాబాద్‌.. విశ్వనగరంగా ప్రసిద్ధి చెందింది. నగరంలో ఓవైపు బడా బడా మాల్స్‌.. అంతర్జాతీయ కంపెనీలు.. అద్దాల భవనాలు.. ఆకాశాన్ని తాకే బిల్డింగులతో.. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా నిలుస్తుంది. ఇది ఓ వైపు మాత్రమే. మరో వైపు చూస్తే.. ఇరుకు సందులు, రోడ్ల మీదనే చెత్తా చెదారం.. పొంగి పొర్లే డ్రైనేజీలు, గతుకుల రోడ్లు.. అధ్వాన్నంగా ఉండే జీవితాలు. ఇక ఏ చిన్న వర్షం వచ్చినా విశ్వ నగరం హైదరాబాద్‌లో రోడ్ల మీదనే చెరువులు దర్శనం ఇస్తాయి. కొన్ని కాలనీల్లో అయితే ఏకంగా ఇళ్లే మునిగిపోతాయి.

ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు, సామాన్యులు భయంభయంగా అడుగు ముందుకు వేస్తూ నడవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు నాలాలో తేలతాయి. ఈ పరిస్థితిపై జనాలు ప్రభుత్వాలను, పాలకులను విమర్శిస్తారు తప్ప.. సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలో ఆలోచించరు. కానీ ఈ మహిళ అలా కాదు. సమస్యను చూసి నాకెందుకులే అనుకోలేదు. ఒంటరి పోరుకు సిద్ధమయ్యింది. ఆమె ధైర్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. పాడైన రోడ్లను బాగు చేయమని కోరుతూ.. వినూత్న రీతిలో నిరసనకు దిగింది. ఆ వివరాలు..

మహిళ ఒంటరి పోరు..

ఈ సంఘటన హైదరాబాద్‌, నాగోల్‌లోని ఆనంద్‌ నగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఏరియాలో రోడ్లు పాడైపోయాయి. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. చిన్న వర్షం వచ్చినా రోడ్ల మీద చెరువులు ఏర్పడుతున్నాయి. ఇబ్బంది పడుతూ తిరుగుతున్నారు తప్ప.. దీనిపై ఎవరూ ప్రశ్నించడం లేదు. కానీ ఓ మహిళ మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ సమస్యపై ఒంటరి పోరుకు రెడీ అయ్యింది.

నడిరోడ్డుపై నీటి మడుగులో కూర్చుని.. నిరసన తెలిపింది. తక్షణమే రోడ్లను బాగు చేయాలని డిమాండ్‌ చేసింది. పాడైపోయిన రోడ్లతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని.. వెంటనే రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. సదరు మహిళన నిరసన వ్యక్తం చేస్తోన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ చేపట్టిన వినూత్న నిరసనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చాలా మంచి పని చేస్తున్నావ్‌ అమ్మా.. నీకున్న పాటి ధైర్యం సమాజంలో చాలా మందికి లేదు. ఎన్నో ఏళ్లుగా రోడ్లు ఇలానే ఉన్నాయి.. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆ తర్వాత సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కనీసం నువ్వైనా ప్రశ్నించడానికి ముందుకు వచ్చావ్‌.. గుడ్‌.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ అంటూ నెటిజనులు సదరు మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments