సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన కూరగాయల రేట్లు!

సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన కూరగాయల రేట్లు!

Vegetables Prices: భోజనంలో కూరగాయల పాత్ర కీలకమైనది. సామాన్యులు నిత్యం అనేక రకాలై కూరగాయలను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వీటి విషయంలో సామాన్యులకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది.

Vegetables Prices: భోజనంలో కూరగాయల పాత్ర కీలకమైనది. సామాన్యులు నిత్యం అనేక రకాలై కూరగాయలను వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వీటి విషయంలో సామాన్యులకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది.

నేటికాలంలో పెరుగుతున్నాయి నిత్యవసర ధరలకు మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువును టచ్ చేసిన మండిపోతున్నాయి. ఇప్పటికే ఉల్లి, టమాట ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. దీంతో ఏమి కొన్నే పరిస్థితి లేక సామాన్యుడు అల్లాడిపోతున్నారు. అలానే  బియ్యం, గోధుమలు, వంటనూనె వంటి వాటి ధరలు కూడా బాగా పెరిగాయి. మొత్తంగా ఇలా పెరిగిన రేట్లతో సామాన్యుడు ఆర్థికంగా అల్లాడిపోతున్నాడు. ఇలాంటి సమయంలోనే పుండు మీద కారం చల్లినట్లు మరో బిగ్ షాక్ తగిలింది. కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మరి..వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

భోజనంలో కూరగాయల పాత్ర కీలకమైనది. సామాన్యులు నిత్యం అనేక రకాలై కూరగాయలను వినియోగిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో వీటి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి చూసినట్లు అయితే.. టమాట, ఉల్లి గడ్డలు ధరలు భారీగా పెరిగాయి. టమాట అయితే ఏకంగా 80 నుంచి 100 వరకు వెళ్లింది. అలానే ఉల్లి ధర కూడా 50 నుంచి 60 రూపాయల ధర పలుకుతుంది. ఇవే సామాన్యులకు కన్నీరు పెట్టిస్తున్నాయి అనుకుంటే.. వీటితో మరికొన్ని కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. మొత్తంగా సామాన్యులకు వరుస షాక్ లు తగులుతున్నాయి. సకాలంలో వర్షాలు లేకపోవటంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గటంతో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి.

బెండ కాయ, వంకాయ, క్యారెట్ వంటివి 60 రూపాయల వరకు పలుకుతున్నాయి. పలు ప్రాంతాల్లు కూరగాయలు ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. అలానే మిర్చి, బంగాళా దుంప ధరలు కిలో రూ. 5 నుంచి రూ. 6 పెరిగాయి. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్థానికంగా దొరకని టమోటా, మిర్చి, ఉల్లిపాయలు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. అలానే కొందరు ఉల్లి గడ్డలను గోడౌన్ లో ఉంచి.. కృతిమ కొరతను సృష్టిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరల నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కూరగాయల విషయం అలా ఉంటే.. మాంసం ప్రియులకు కూడా గట్టి షాక్ తగులుతుంది.  చికెన్ ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని రోజుల వరకు 250 వరకు నడిచిన చికెన్ ధరలు ఈసారి ఏకంగా 300 దాటింది.  మార్కెట్ లో స్కిన్ లెస్ చికెన్ కిలో 306 రూపాయలు పలుకుతోంది. ఇలా చికెన్ ధరలు పెరిగినా కూడా పలు ప్రాంతాల్లో  మాంసాహార ప్రియులు వెనకడుగు వేయడం లేదు.  ఎండలు తగ్గకపోవడంతో బ్రాయిలర్ కోడి త్వరగా చనిపోతుందని, అందుకే డిమాండ్ కు తగిన సప్లయ్  లేకపోవడం ధరలు పెరగడానికి కారణం  పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Show comments