Huge Discount On Smartphones In Flipkart: Flipkart Offers: స్మార్ట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్!

Flipkart Offers: స్మార్ట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఈ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్!

Huge Discount On Smartphones In Flipkart: స్మార్ట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఏ ఫోన్లపై ఎంత డిస్కౌంట్ వస్తుంది? ఏ ఫోన్లు వస్తున్నాయి? అనే వివరాలు మీ కోసం.

Huge Discount On Smartphones In Flipkart: స్మార్ట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఏ ఫోన్లపై ఎంత డిస్కౌంట్ వస్తుంది? ఏ ఫోన్లు వస్తున్నాయి? అనే వివరాలు మీ కోసం.

స్మార్ట్ ఫోన్ కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందిస్తుంది. మెగా జూన్ బొనాంజా సేల్ లో భాగంగా భారీ తగ్గింపుతో పలు ఐటమ్స్ ని విక్రయిస్తోంది. జూన్ 13వ తేదీన మొదలైన ఈ సేల్ జూన్ 19 వరకూ ఈ సేల్ నడుస్తుంది. ఈ సేల్ లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు కల్పించింది. మీరు స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటే కనుక ఏ ఫోన్లు ఎంత డిస్కౌంట్ తో ఎంత ధరకు వస్తున్నాయో తెలుసుకోండి. 

వివో టీ3ఎక్స్ 5జీ:

వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ పై 4 వేల తగ్గింపు లభిస్తుంది. దీని అసలు ధర రూ. 17,499 కాగా రూ. ఆఫర్ లో 13,499 రూపాయలకే వస్తుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తుంది. 50+2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో, 6 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తుంది. ఫోన్ మీద ఏడాది వారంటీ, యాక్ససరీస్ మీద 6నెలల వారంటీ ఉంది. ఇక ఇది సెలెస్టియల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్స్ రంగుల్లో లభిస్తుంది. 

రియల్ మీ పీ1 5జీ:

సేల్ లో భాగంగా రియల్ మీ పీ1 5జీ స్మార్ట్ ఫోన్ పై 5 వేల తగ్గింపు లభిస్తుంది. దీని అసలు ధర రూ. 20,999 ఉండగా.. ఆఫర్ లో రూ. 15,999కే సొంతం చేసుకోవచ్చు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తుంది. 50+2 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో, డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ తో వస్తుంది. ఫోన్ మీద ఏడాది వారంటీ, యాక్ససరీస్ మీద 6నెలల వారంటీ ఉంది. ఇది పీకాక్ గ్రీన్, ఫోనిక్స్ రెడ్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఇందులో 256 జీబీ స్టోరేజ్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఇంకో వెయ్యి, రెండు వేలు అదనంగా పెట్టుకోవాలి. సెలెక్టెడ్ క్రెడిట్, డెబిట్ కార్డు మీద అదనంగా రూ. 1000 డిస్కౌంట్ పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ:

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర ఆన్ లైన్ లో రూ. 36,999 ఉండగా.. ఫ్లిప్ కార్ట్ లో 29,999 రూపాయలకే లభిస్తుంది. 7 వేల రూపాయలు డిస్కౌంట్ తో వస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 2 వేల రూపాయలు తగ్గింపు పొందవచ్చు. ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. 6.7 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. 50+13+10 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా మొత్తం 4 కెమెరాలు ఇచ్చారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 7 జెన్ 3 మొబైల్ ప్లాట్ ఫామ్ ప్రాసెసర్ తో వస్తుంది. ఫోన్ మీద ఏడాది వారంటీ, యాక్ససరీస్ మీద 6నెలల వారంటీ ఉంది. ఇది బ్లాక్ బ్యూటీ, లూక్స్ లావెండర్ రెండు రంగుల్లో వస్తుంది. 68 వాట్ ఛార్జర్ తో వస్తుంది.  

ఐఫోన్ 15:

మెగా జూన్ బొనాంజా సేల్ లో భాగంగా యాపిల్ ఐఫోన్ 15పై 17 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,900 కాగా మీరు 13,901 రూపాయల తగ్గింపుతో 65,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. పలు బ్యాంక్ ఆఫర్లతో దీని మీద అదనంగా కొంత తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ డిస్ప్లేతో వస్తుంది. ఏ16 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇందులో 48+12 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్  మీద ఏడాది వారంటీ ఉంది. బాక్స్ లో  ఉన్న యాక్ససరీస్ మీద ఆరు నెలల వారంటీ ఉంది. ఇది నలుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో వస్తుంది.

Show comments