Change Snapchat Notification Sound: స్నాప్‌చాట్‌ వాడుతున్నారా? ఐతే నోటిఫికేషన్ సౌండ్‌ని ఇలా మార్చుకోండి!

స్నాప్‌చాట్‌ వాడుతున్నారా? ఐతే నోటిఫికేషన్ సౌండ్‌ని ఇలా మార్చుకోండి!

Change Snapchat Notification Sound: ఒక్కో కాంటాక్ట్ నంబర్ కి ఒక్కో రింగ్ టోన్ పెట్టుకునే ఆప్షన్ ఉన్నట్టు మెసేజ్ నోటిఫికేషన్స్ కి కూడా రకరకాల నోటిఫికేషన్ సౌండ్స్ ఉంటే బాగుంటుంది కదా. స్నాప్ చాట్ లో ఈ ఫీచర్ అయితే ఉంది. పలు చాట్స్ కి, స్నాప్స్ కి వివిధ నోటిఫికేషన్ సౌండ్స్ పెట్టుకోవచ్చు. మూడు రకాల పద్ధతుల్లో స్నాప్ చాట్ నోటిఫికేషన్ సౌండ్ ని మార్చుకోవచ్చు.

Change Snapchat Notification Sound: ఒక్కో కాంటాక్ట్ నంబర్ కి ఒక్కో రింగ్ టోన్ పెట్టుకునే ఆప్షన్ ఉన్నట్టు మెసేజ్ నోటిఫికేషన్స్ కి కూడా రకరకాల నోటిఫికేషన్ సౌండ్స్ ఉంటే బాగుంటుంది కదా. స్నాప్ చాట్ లో ఈ ఫీచర్ అయితే ఉంది. పలు చాట్స్ కి, స్నాప్స్ కి వివిధ నోటిఫికేషన్ సౌండ్స్ పెట్టుకోవచ్చు. మూడు రకాల పద్ధతుల్లో స్నాప్ చాట్ నోటిఫికేషన్ సౌండ్ ని మార్చుకోవచ్చు.

మీరు స్నాప్ చాట్ వాడుతున్నారా? అయితే మీ కోసమే ఈ టిప్. సాధారణంగా ఒకరోజులో చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అందులో స్పామ్ కాల్స్, క్రెడిట్ కార్డు కాల్స్, లోన్స్ కాల్స్, మార్కెటింగ్ కాల్స్, ఫైనాన్స్ అని రకరకాల కాల్స్ వస్తుంటాయి. ఈ కాల్స్ కి ఒక రింగ్ టోన్ పెట్టుకుంటే ఫోన్ చూడకుండానే లైట్ తీసుకోవచ్చు. ముఖ్యమైన వ్యక్తుల కోసం ఒక రింగ్ టోన్ సెట్ చేసుకుంటే దాన్ని బట్టి కాల్ లిఫ్ట్ చేయచ్చు. అయితే ఇదే ఫీచర్ స్నాప్ చాట్ లో కూడా ఉంది. అవును మీరు చాట్ కి తగ్గట్టు నోటిఫికేషన్ సౌండ్ ని సెట్ చేసుకోవచ్చు. ఫోన్ మీకు దూరంగా ఉన్నప్పుడు ముఖ్యమైన వ్యక్తులు మెసేజ్ చేశారో లేక స్నాప్ చాట్ కంపెనీ మెసేజులు, లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా చాట్ చేశారో అని గుర్తుపట్టేలా నోటిఫికేషన్ సౌండ్ ని సెట్ చేసుకోవచ్చు. మూడు పద్ధతుల్లో ఈ సౌండ్ ని మార్చుకోవచ్చు. ఎలాగో చూడండి.

మొదటి పద్ధతి: చాట్ స్క్రీన్ నుంచి నోటిఫికేషన్ సౌండ్ ని మార్చుకోవచ్చు

ఏ వ్యక్తి చాట్ కి సంబంధించిన నోటిఫికేషన్ సౌండ్ మార్చాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి చాట్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో చాట్ అండ్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. అందులో మ్యూట్ చాట్స్, మ్యూట్ కాల్స్ తో పాటు నోటిఫికేషన్ సౌండ్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే కస్టమ్ నోటిఫికేషన్ సౌండ్స్ కనబడుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెలకు 49 రూపాయలు, ఏడాదికి 588 రూపాయల ప్లాన్స్ ఉంటాయి. మొదటి వారం ఫ్రీగా ఈ ఫీచర్ ని వాడుకోవచ్చు.

రెండవ పద్ధతి: స్నాప్ చాట్+ మెనూలోని అలర్ట్ టోన్ ని ఎంపిక చేసుకోవచ్చు  

పైన టాప్ లో ఎడమ వైపు ఉన్న బిట్ మోజీ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మై పబ్లిక్ ప్రొఫైల్ పైన ఉన్న స్నాప్ చాట్+ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో కస్టమ్ నోటిఫికేషన్ సౌండ్స్ కనబడతాయి. అందులో మీకు నచ్చిన సౌండ్ ని ఎంపిక చేసుకుని.. ఫైనల్ గా ఆ సౌండ్ ని నచ్చిన వ్యక్తి చాట్ కి నోటిఫికేషన్ సౌండ్ గా పెట్టుకోవచ్చు. ఇది కూడా స్నాప్ చాట్ లో ఈ ఫీచర్ ని సబ్ స్క్రైబ్ చేసుకున్నవారికే అందుబాటులో ఉంది. మొదటి వారం ఫ్రీగా వాడుకోవచ్చు.  

 

మూడవ పద్ధతి: ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ నుంచి నోటిఫికేషన్ సౌండ్ ని ఎంపిక చేసుకోవచ్చు

మీరు కనుక స్నాప్ చాట్ యాప్ మొత్తానికి నోటిఫికేషన్ సౌండ్ మార్చాలని అనుకుంటే కనుక ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ నుంచి చేయచ్చు. వివిధ స్నాప్ చాట్ లకి నోటిఫికేషన్ సౌండ్ మార్చడం కుదరదు కానీ డీఫాల్ట్ స్నాప్ చాట్ నోటిఫికేషన్ ని మార్చుకోవడానికి వీలుంది. దీని కోసం మీరు స్నాప్ చాట్+ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని కోసం ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ లోకి వెళ్ళాలి. అందులో యాప్ నోటిఫికేషన్స్ లోకి వెళ్లి స్నాప్ చాట్ పై ట్యాప్ చేయాలి. అందులో స్నాప్స్ అండ్ చాట్స్ కేటగిరీ కనబడుతుంది. అందులో సౌండ్స్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన సౌండ్ ని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయాలి. కొన్ని ఫోన్స్ లో ఈ సెట్టింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి స్నాప్ చాట్ నోటిఫికేషన్స్ పేజ్ కనబడేవరకూ ట్రై చేయాలి. 

ఇవే స్నాప్ చాట్ లో నోటిఫికేషన్ సౌండ్ మార్చడానికి ఉన్న స్టెప్స్. ఒక్కో స్నాప్ చాట్ కాంటాక్ట్ ఒక్కో నోటిఫికేషన్ సౌండ్ పెట్టుకోవచ్చు. అయితే మీరు సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్టింగ్స్ లో ఫ్రీగా నోటిఫికేషన్ అలర్ట్ ని మార్చుకునే వెసులుబాటు ఉన్నట్టు ఐఓఎస్ లో లేదు. దీని కోసం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ని ఎంచుకోవాలి.  

Show comments