సూపర్‌ 8లో IND vs AUS.. గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు పూర్తి కాకముందే ఎలా డిసైడ్‌ చేశారు?

సూపర్‌ 8లో IND vs AUS.. గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు పూర్తి కాకముందే ఎలా డిసైడ్‌ చేశారు?

IND vs AUS, T20 World Cup 2024, Super 8: గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ఇంకా కంప్లీట్‌ కాలేదు.. సగం టీమ్స్‌ కూడా సూపర్‌ 8కు క్వాలిఫై కాలేదు.. అప్పుడు ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ఐసీసీ ఎలా షెడ్యూల్‌ చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

IND vs AUS, T20 World Cup 2024, Super 8: గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ఇంకా కంప్లీట్‌ కాలేదు.. సగం టీమ్స్‌ కూడా సూపర్‌ 8కు క్వాలిఫై కాలేదు.. అప్పుడు ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ఐసీసీ ఎలా షెడ్యూల్‌ చేసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రతి గ్రూప్ నుంచి ఒక్కో టీమ్‌ సూపర్‌ 8 క్వాలిఫై అయింది. గ్రూప్‌-ఏ నుంచి ఇండియా, గ్రూప్‌-బీ నుంచి ఆస్ట్రేలియా, గ్రూప్‌-సీ నుంచి వెస్టిండీస్‌, గ్రూప్‌-డీ నుంచి సౌతాఫ్రికా జట్లు సూపర్‌కు అర్హత సాధించాయి. ఇంకా ప్రతి గ్రూప్‌ నుంచి మరో టీమ్‌ క్వాలిఫై కావాల్సి ఉంది. గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లో జూన్‌ 18 వరకు ఉన్నాయి. కానీ, అప్పుడే సూపర్‌ 8లో కొన్ని మ్యాచ్‌లు ఈ జట్ల మధ్యే అంటూ ఐసీసీ షడ్యూల్‌ ప్రకటించింది. అందులో ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఒకటి. ఈ రెండు జట్లు క్వాలిఫై అయినా.. గ్రూప్‌ స్టేజ్‌లో టేబుల్‌ టాపర్‌గా సూపర్‌ 8కు క్వాలిఫై అవుతాయా లేక రెండో స్థానంలో నిలిచి క్వాలిఫై అవుతాయా అనే విషయం ఇంకా తెలియదు. కానీ, అప్పుడే ఈ రెండు టీమ్స్‌కు మ్యాచ్‌ సెట్‌ చేసేశారు. ఇది ఎలా డిసైడ్‌ చేశారంటూ చాలా మంది క్రికెట్‌ అభిమానులు డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు.

గ్రూప్‌-ఏ నుంచి టీమిండియా టేబుల్‌ టాప్‌గా సూపర్‌ 8కు చేరితే.. జూన్‌ 20న గ్రూప్‌-సీలో మొదటి స్థానంలో నిలిచిన టీమ్‌తో, జూన్‌ 22న గ్రూప​్‌-డీలో రెండో స్థానంలో నిలిచిన టీమ్‌, జూన్‌ 24న గ్రూప్‌-బీలో రెండో స్థానంలో నిలిచిన జట్టు అంటే బీ2తో మ్యాచ్‌ ఆడాలి. గ్రూప్‌ స్టేజ్‌లో ఆయా గ్రూప్స్‌లో తొలి రెండు స్థానంలో నిలిచిన టీమ్స్‌కు 1, 2గా పేర్లు ఇస్తారు. ఉదాహరణకు గ్రూప్‌-ఏ నుంచి ఇండియా తొలి స్థానంలో, అమెరికా రెండో స్థానంలో నిలిచి సూపర్‌ 8కు క్వాలిఫై అయితే.. ఇండియాను ఏ1, అమెరికాను ఏ2గా పరిగణిస్తారు. అన్ని గ్రూప్స్‌కు ఇదే వర్తిస్తుంది. ఈ లెక్కన జూన్‌ 24న ఏ1 వర్సెస్‌ బీ2 మ్యాచ్‌ జరగాలి. ఇండియా ఎలాగో ఏ1గా క్వాలిఫై అయింది. కానీ, గ్రూప్‌-బీ నుంచి ఆస్ట్రేలియా తొలి స్థానంలో నిలిచి బీ1గా సూపర్‌ 8కు చేరే అవకాశం కనిపిస్తోంది. అయినా కూడా ఆస్ట్రేలియాను బీ2గానే పరిగణిస్తూ.. ఇండియాతో మ్యాచ్‌ ఫిక్స్‌ చేశారు. అయితే.. ఇదంతా టోర్నీ ప్రారంభానికి ముందే డిసైడ్‌ చేశారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ప్రతి గ్రూప్‌ నుంచి రెండు పెద్ద టీమ్స్‌కు ఏ1, ఏ2, బీ1, బీ2, సీ1, సీ2, డీ1, డీ2 హోదాలు ముందే ఇచ్చేశారు. గ్రూప్‌-ఏలో ఇండియాకు ఏ1, పాకిస్థాన్‌కు ఏ2, గ్రూప్‌-బీలో ఇంగ్లండ్‌కు బీ1, ఆస్ట్రేలియాకు బీ2, గ్రూప్‌-సీలో న్యూజిలాండ్‌కు సీ1, వెస్టిండీస్‌కు సీ2, గ్రూప్‌-డీలో సౌతాఫ్రికాకు డీ1, శ్రీలంకకు డీ2 హోదా ఇచ్చారు. ఈ 8 టీమ్స్‌.. గ్రూప్‌ స్టేజ్‌లో ఒకటి, రెండు ఏ స్థానంలో నిలిచినా పర్వాలేదు.. జస్ట్‌ సూపర్‌ 8కు క్వాలిఫై అయితే చాలు. గ్రూప్‌ స్టేజ్‌లో పాయింట్ల పట్టికలో ఏ స్థానంలో నిలిచినా కూడా వాటిని ముందుగా గుర్తించిన హోదా తోనే పరిగణిస్తారు. ఒక వేళ ఆయా టీమ్స్‌ సూపర్‌ 8కు క్వాలిఫై కాకపోతే.. వాటి స్థానంలో క్వాలిఫై అయిన టీమ్‌ ఏ1గానో, ఏ2గానో ఉంటుంది. పాయింట్ల పట్టికలో ఏ స్థానంలో నిలుస్తుందో దాన్ని బట్టి పరిగణిస్తారు.

గ్రూప్‌-ఏ నుంచి ఇండియా పాయింట్ల పట్టికలో ఫస్ట్‌ ప్లేస్‌లోనే సూపర్‌ 8కు చేరింది. రెండో స్థానంలో అమెరికా సూపర్‌ 8కు చేరితే.. పాకిస్థాన్‌కు ఇచ్చిన ఏ2.. ఇప్పుడు అమెరికాకి వర్తిస్తుంది. అలాగే గ్రూప్‌-బీలో బీ1గా ఇంగ్లండ్‌ను పేర్కొన్నారు. కానీ, ఇంగ్లండ్‌ సూపర్‌ 8కు క్వాలిఫై కాకపోతే.. దాని స్థానంలో క్వాలిఫై అ‍య్యే టీమ్‌ను బీ1గా పరిగణిస్తారు. ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచినా సరే దాన్నే బీ1గా భావిస్తారు. ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నా.. దాన్ని బీ2గా పరిగణిస్తారు. అందుకే జూన్‌ 24న ఏ1, బీ2గా ఉన్న ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. అలాగే జూన్‌ 20న సీ1తో ఆడాలి. సీ1 హోదాను కలిగి ఉన్న న్యూజిలాండ్‌ సూపర్‌ 8కు క్వాలిఫై అ‍య్యేలా లేదు. దాని స్థానంలో సూపర్‌ 8కు క్వాలిఫై అ‍య్యేలా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడే తలపడనుంది టీమిండియా. అలాగే జూన్‌ 22న డీ2తో ఆడనుంది. డీ2గా ఉన్న శ్రీలంక కూడా సూపర్‌ 8కు క్వాలిఫై అయ్యే సూచనలు లేకపోవడందో.. బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌లో ఏదో ఒక టీమ్‌ సూపర్‌ 8కు అర్హత సాధించి.. డీ2గా టీమిండియాతో తలపడనుంది. మరి ఐసీసీ ప్రకటించిన ఈ తికమక షెడ్యూల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments