HYDలో దారుణం..చికిత్స పేరుతో రూ. 16 లక్షల బిల్లు

HYDలో దారుణం..చికిత్స పేరుతో రూ. 16 లక్షల బిల్లు

హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. చికిత్స పేరుతో 16 లక్షలు వసూలు చేశారు. బాధితులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.

హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. చికిత్స పేరుతో 16 లక్షలు వసూలు చేశారు. బాధితులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.

వైద్యోనారాయణహరి అన్నారు పెద్దలు. డాక్టర్లను దేవుళ్లతో సమానంగా భావిస్తారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వైద్యుల పట్ల అపారమైన నమ్మకం, గౌరవం ఉంటుంది. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు చూస్తే డాక్టర్లపై, హాస్పిటల్స్ పై నమ్మకం సన్నగిల్లుతున్నది. వైద్యం పేరుతో లక్షల రూపాయలను వసూలు చేస్తూ పేషెంట్ల ప్రాణాలను తోడేస్తున్నారు. ఇదే రీతిలో హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చికిత్స పేరుతో 16 లక్షల బిల్లు వసూలు చేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వస్తే లక్షల రూపాయలను దండుకున్నారు. ఈ ఘటన కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

మీరు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ మూవీ చూసే ఉంటారు. ఆ సినిమాలో డాక్టర్లు చికిత్స పేరుతో లక్షల రూపాయలను వసూలు చేసి చివరకు పేషెంట్ మృతి చెందినట్లు చెప్తారు. అయితే ఇప్పుడు సినిమాలోని ఈ సీన్ ను కూకట్ పల్లిలోని అమోర్ ఆసుపత్రి వైద్యులు రిపీట్ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించగా.. టెస్టులు, ఆపరేషన్ చేయాలంటూ లక్షలు వసూలు చేశారు. 5 రోజులుగా బాధిత కుటుంబానికి చుక్కలు చూపించారు. ఆఖరికి బాధితురాలు చనిపోయిందంటూ చేతులు దులుపుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రవళ్లిక అనే యువతిని ఐదు రోజుల క్రితం కూకట్ పల్లిలోని అమోర్ ఆస్రత్రికి చికిత్సకోసం తరలించారు కుటుంబ సభ్యులు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సింది పోయి ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు ప్రవళ్లిక కుటుంబ సభ్యులకు నరకం చూపించారు. ముందుగా ఆపరేషన్ చేయాలని అందుకు రూ. 3.5 లక్షలు ఖర్చు అవుతందని చెప్పారు. ఐదు రోజులుగా టెస్టులు, చికిత్స పేరిట ఇప్పటివరకు రూ. 16 లక్షలు వసూలు చేశారు. ఇక బుధవారం అర్థరాత్రి ప్రవళ్లిక చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు చేపట్టారు. చికిత్స పేరుతో లక్షల రూపాయలను వసూలు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments