మూవీ లవర్స్ కు హరోంహర టీం బంపరాఫర్.. ఏంటంటే?

మూవీ లవర్స్ కు హరోంహర టీం బంపరాఫర్.. ఏంటంటే?

సినీ ప్రియులకు హరోంహర మూవీ టీం బంపరాఫర్ ను అందించింది. రెండు టికెట్స్ కొంటే ఒక టికెట్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎలా పొందొచ్చంటే?

సినీ ప్రియులకు హరోంహర మూవీ టీం బంపరాఫర్ ను అందించింది. రెండు టికెట్స్ కొంటే ఒక టికెట్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎలా పొందొచ్చంటే?

హీరో సుధీర్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ హరోంహర. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 14న హరోంహర మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు మూవీ లవర్స్ కోసం బంపరాఫర్ ను ప్రకటించింది. రెండు టికెట్లు కొనుగోలు చేస్తే ఒకటికెట్ ను ఫ్రీగా అందించనున్నట్లు తెలిపింది.

కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. వీరిని ఏమాత్రం నిరూత్సాహ పర్చకుండా చిత్ర యూనిట్ మంచి ఆఫర్లను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో హరోం హర సినిమా రిలీజ్ సందర్భంగా మూవీ టీం మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ అందించింది. రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ అంటూ మూవీ టీమ్ ప్రకటించింది. ఆన్‍లైన్ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ‘HAROMHARA’ అనే కోడ్‍ను అప్లై చేయడం ద్వారా బుక్‍ మై షోలో ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.

బుక్ మై షోలో మూడు టికెట్లను సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసే ముందు HAROMHARA అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే రెండు టికెట్ల ధరకే మూడు టికెట్స్ లభిస్తాయని మూవీ టీమ్ వెల్లడించింది. హరోంహర సినిమాను సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై సుమంత్ నాయుడు గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో సునీల్ ,జయ ప్రకాష్ ,అక్షర ,అర్జున్ గౌడ ,లక్కీ లక్ష్మణ్ వంటి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Show comments