Harom Hara Movie Review: సుధీర్ బాబు హరోం హర రివ్యూ.. ఎలా ఉందంటే..?

Harom Hara Review: సుధీర్ బాబు హరోం హర రివ్యూ.. ఎలా ఉందంటే..?

Harom Hara Movie Review & Rating in Telugu: టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్సటైల్ నటుల్లో ఒకరు సుధీర్ బాబు. హిట్టు, ఫట్టులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. డిఫరెంట్ మూవీలను ట్రై చేస్తుంటాడు. ఇప్పుడ హరోం హర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ సినిమా ఎలా ఉందో చదివేయండి.

Harom Hara Movie Review & Rating in Telugu: టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్సటైల్ నటుల్లో ఒకరు సుధీర్ బాబు. హిట్టు, ఫట్టులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. డిఫరెంట్ మూవీలను ట్రై చేస్తుంటాడు. ఇప్పుడ హరోం హర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ సినిమా ఎలా ఉందో చదివేయండి.

Harom Hara

20240614, A
Action
  • నటినటులు:సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జయ ప్రకాష్, రవికాలే, అర్జున్ గౌడ
  • దర్శకత్వం:జ్ఞానసాగర్ ద్వారక
  • నిర్మాత:సుమంత్ జి నాయుడు
  • సంగీతం:చైతన్య భరద్వాజ్
  • సినిమాటోగ్రఫీ:అరవింద్ విశ్వనాథన్

2.5

ప్రతి శుక్రవారంలాగానే ఈ ఫ్రైడే కూడా పలు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా.. అందరి చూపు మాత్రం ఆ రెండు సినిమాలపైనే. సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హరా, విజయ్ సేతుపతి 50వ మూవీ మహారాజా ఉన్నాయి. మహారాజా డబ్బింగ్ చిత్రం కాగా, సుధీర్ బాబు అసలు సిసలైన తెలుగు సినిమా. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. ఎస్ఎస్సీ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, జయ ప్రకాష్, రవికాలే, అర్జున్ గౌడ కీలక పాత్రధారులు. సినిమా హిట్టు, ఫట్టులతో సంబంధం లేకుండా డిఫరెంట్ చిత్రాలను ట్రై చేస్తున్నాడు. మరీ ఈ మూవీతో హిట్ అందుకున్నాడో లేదో చూద్దాం.

కథ

ఆంధ్రపద్రేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు కలిసే అందమైన ప్రాంతం కుప్పం. ఈ ఊరిలో తిమ్మారెడ్డి, అతడి సోదరుడు బసవ (రవి కాలె), కుమారుడు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ)లే పెత్తనం. ఊరిని తమ గుప్పిట్లో పెట్టుకుని అజమాయిషీ చెలాయిస్తుంటారు. ఊళ్లో ప్రజలకు వారంటే దడ. ఆ సమయంలో గ్రామంలోకి ఎంటర్ అవుతాడు సుబ్రమణ్యం (సుధీర్ బాబు). అక్కడ ఓ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తుంటాడు. ఓ రోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ పడటంతో సస్పెండ్ అవుతాడు. అంతలో తన ఫ్రెండ్ కానిస్టేబుల్ పళని స్వామి సస్పెండ్ కాగా, అతడి దగ్గర ఓ తుపాకీ ఉండటాన్ని చూస్తాడు. తుపాకీతో పాటు బ్లూ ఫ్రింట్ కూడా ఉండటంతో.. తన తెలివి తేటలతో గన్ తయారు చేస్తాడు సుబ్రమణ్యం. ఇదే క్రమంలో తన ఉద్యోగం పోవడానికి కారణమైన శరత్ రెడ్డితో చేతులు కలుపుతాడు.ఓ మాఫియాని క్రియేట్ చేస్తాడు. అతడు శరత్ రెడ్డితో ఎందుకు చేతులు కలిపాడు..? ఆ ఊరికి అతడేం చేశాడు? హరోం హర అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

పెద్ద మనుషుల ముసుగులో ఊరిని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం.. గ్రామాన్ని శాసించడం, దుర్మార్గుల నుండి వేరో ఊరు నుండి వచ్చిన వ్యక్తి ప్రజల్ని కాపాడే కథలు ఇండస్ట్రీలో కోకొల్లలు. అదే లైన్‌తో వచ్చింది ఈ చిత్రం కూడా. కుప్పం అనే ప్రాంతానికి బతుకు దెరువు కోసం వస్తాడు మన హీరో. అక్కడ ముఠా ఆట ఎలా కట్టించాడు.? ఆ ఊరికి అతడు ఎలా హీరో అయ్యాడో చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. తన చెప్పాలన్న పాయింట్ చాలా సూటిగా, స్పష్టంగా చెప్పేశాడు. మాస్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీని నడిపించాయి. యాక్షన్ సీన్స్ కావాలనుకునే మూవీ లవర్స్‌ను ఈ సినిమా సాటిస్పై చేస్తుంది. ఇందులో వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది. సెకండాఫ్ లో కథ వేగం పెరుగుతుంది. ఇందులో కాస్తంత ఎమోషన్ తగ్గినట్లు కనిపిస్తుంది. రాయలసీమ భాషలో సంభాషణలు చాలా బాగున్నాయి.

ఎవరెలా చేశారంటే..

ట్రైలర్‌లో ఇది మాస్ సంభవం అన్నట్లుగానే.. ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కొన్ని సీన్లు పుష్ప, కేజీఎఫ్ చిత్రాలను తలపిస్తుంటాయి. ఊరిలోకి అడుగుపెట్టే సమయంలో అమాయకుడిగా..ఎంట్రీ ఇచ్చి తర్వాత మారిన సుధీర్ బాబును బాగా చూపించాడు డైరెక్టర్. సుధీర్ బాబు కూడా సరికొత్త మాస్ లుక్స్‌లో దర్శనమిచ్చాడు. మాళవిక శర్మ తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఈ సినిమా మరో ప్లస్ అయిన నటుడు సునీల్. ఇందులో ఫైట్స్, యాక్షన్స్ సన్నివేశాల్లో సుధీర్ అదరగొట్టేశాడు. చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీని టాప్ నాచ్‌లో నిలబెడుతుంది. అరవింద్ విశ్వనాథన్ కెమెరా వర్క్ బాగుంది. ఇప్పటి వరకు నైట్రో స్టార్‌గా ఉన్న సుధీర్.. ఈ మూవీతో నవ దళపతిగా మారిపోయాడు. రవికాలే, అర్జున్ గౌడ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సునీల్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ ఫుల్ లెంథ్ రోల్ దొరికింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు

  • సుధీర్, సునీల్ యాక్టింగ్
  • యాక్షన్ సీక్వెన్స్
  • సెకండాఫ్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

బలహీనలు

  • ఎమోషన్స్ లేకపోవడం
  • పుష్ప సినిమాను తలపించడం

రేటింగ్‌: 2.5/5

చివరి మాట: ఇది సుధీర్ బాబు మాస్ సంభవం

(గమనిక): ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
Show comments