భర్తతో విభేదాలు.. మరో వ్యక్తితో కనిపించిన హార్ధిక్‌ భార్య నటాషా?

భర్తతో విభేదాలు.. మరో వ్యక్తితో కనిపించిన హార్ధిక్‌ భార్య నటాషా?

Hardik Pandya, Natasa: హార్ధిక్‌ పాండ్యాతో విడాకులు తీసుకుని, 70 శాతం ఆస్తిని పొందింది అంటూ అతని భార్య నటాషాపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె మరొకరితో కనిపించింది. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Hardik Pandya, Natasa: హార్ధిక్‌ పాండ్యాతో విడాకులు తీసుకుని, 70 శాతం ఆస్తిని పొందింది అంటూ అతని భార్య నటాషాపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె మరొకరితో కనిపించింది. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్ధిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన భార్య నటాషాతో అతనికి విభేదాలు తలెత్తాయని.. వాళ్లిద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయ్యారంటూ.. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తు ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని నేషనల్‌ మీడియా కూడా వెల్లడించింది. విడాకుల నేపథ్యంలో హార్ధిక్‌ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం వాటాను తన భార్య నటాషా పేరు మీదకి మార్చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇంత తీవ్ర స్థాయిలో పుకార్లు వస్తున్న సమయంలోనే.. పాండ్యా భార్య నటాషా తాజాగా మరో వ్యక్తితో కనిపించింది. ఇద్దరు కలిసి లంచ్‌ కోసం ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు.

ప్రస్తుతం వారి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. హార్ధిక్‌ పాండ్యాతో విభేదాలు, విడాకులు అంటూ ఈ రేంజ్‌లో ప్రచారం సాగుతున్నా.. నటాషా మాత్రం ఏం పట్టనట్లు మరో వ్యక్తితో బయట తిరడంపై నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆమె తన స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో కలిసి కనిపించింది. అతనితో కలిసి భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్‌కు వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమెను మీడియా ప్రతినిధులు విడాకులపై ప్రశ్నించగా.. ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయింది. దీంతో.. పాండ్యా-నటాషా విడాకులు తీసుకుంటున్నారు అనే పుకారు నిజమయ్యేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యా.. మరి కొన్ని రోజుల్లో పాండ్యా టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం వెళ్లనున్నాడు. ఇలాంటి కీలక టైమ్‌లో అతని వ్యక్తిగత జీవితం ఇంత పెద్ద కుదుపు రావడం విషాదకరం. మరి ఇందులోంచి పాండ్యా ఎలా పడతాడో అని క్రికెట్‌ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే.. అసలు వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి? నిజంగానే విడాకులు తీసుకున్నారా? ఆస్తి విషయంలోనే గొడవలు వచ్చాయా? అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఏది ఏమైనా.. ప్రస్తుతం పాండ్యా టఫ్‌ టైమ్‌ను ఫేస్‌ చేస్తున్నట్లు మాత్రం స్పష్టం అవుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments