HanuMan Team Donates Rs 5 To Ram Mandir: ‘హనుమాన్’ మూవీ టీమ్ సంచలన నిర్ణయం.. అయోధ్య రామాలయం కోసం..!

HanuMan: ‘హనుమాన్’ మూవీ టీమ్ సంచలన నిర్ణయం.. అయోధ్య రామాలయం కోసం..!

ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ మూవీ సంక్రాంతి పండక్కి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అయితే అయోధ్య భవ్య రామమందిరం కోసం ఈ చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ మూవీ సంక్రాంతి పండక్కి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అయితే అయోధ్య భవ్య రామమందిరం కోసం ఈ చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

శ్రీ రాముడి భక్తుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. అయోధ్య భవ్య రామమందిరం త్వరలో ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభతోత్సవం, స్వామివారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ ప్రోగ్రామ్​ కోసం శ్రీ రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యలోని రోడ్లను సూర్య స్తంభాలతో సుందరంగా అలంకరించారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతో పాటు పలువురు సెలబ్రిటీలు, నేతలు విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2 వేలకు పైగా ఇతర అతిథులను ఆహ్వానించారు. గెస్ట్​ లిస్ట్​లో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు సినీ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇదిలా  ఉంటే.. రామాలయం కోసం ‘హనుమాన్’ చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ రిలీజ్​కు రెడీ అయిపోయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రతి టికెట్ మీద రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుంది. ఈ నిర్ణయాన్ని సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్​లో మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన ఈ ప్రోగ్రామ్​కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఈవెంట్​కు రావడానికి పలు రీజన్స్ ఉన్నాయని.. తన ఇష్టదైవం ఆంజనేయస్వామి అని చెప్పారు. హనుమంతుడ్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని తీసిన ఫిల్మ్ ఇదన్నారు. డైపర్లు వేసుకొనే స్టేజ్ నుంచి డయాస్ ఎక్కే స్టేజ్​కు చేరుకున్న హీరో తేజ సజ్జా మరో కారణమన్నారు మెగాస్టార్. టీజర్, ట్రైలర్​ చూసినప్పుడు ప్రతి సీన్​లో ఫైన్​నెస్ కనిపించిందన్నారు. టీజర్, ట్రైలర్ చూశాక ఫస్ట్ టైమ్ ఎవరీ డైరెక్టర్ అని అడిగి మరీ తెలుసుకున్నానని చిరంజీవి పేర్కొన్నారు.

‘నా ఆరాధ్య దైవం హనుమంతుడి గురించి బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన్ను నిత్యం పూజిస్తూ క్రమశిక్షణతో, నిబద్ధతతో ఈ స్థాయికి చేరుకున్నా. అయితే ఇలాంటి స్టేజ్ మీద ఆంజనేయుడి గురించి కచ్చితంగా చెప్పాలి. అందుకే పిలవగానే మరో ఆలోచన లేకుండా ఈ ఈవెంట్​కు వచ్చేశా. ప్రతి ఒక్కరికీ హనుమంతుడు స్ఫూర్తి. ఆంజనేయుడు మనకు ఆశీస్సులు అందిస్తే జీవితాంతం వదలడు. ఈ మూవీ కచ్చితంగా హిట్టవుతుంది. ప్రశాంత్ వర్మ, తేజ కష్టం వృథా పోవు. అయోధ్య రామాలయం కోసం వీళ్లు చేస్తున్న సాయం అభినందనీయం’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. తమ సినిమాకు అండగా నిలబడినందుకు మెగాస్టార్​కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. సినిమా అనేది ఒక యుద్ధమని.. ఛాన్సులు రావడం, చిత్రాన్ని తీయడం ఒకెత్తయితే రిలీజ్ చేయడం పెద్ద యుద్ధమన్నారు. మరి.. రామాలయం కోసం ప్రతి టికెట్ మీద రూ.5 విరాళంగా ఇవ్వాలని ‘హనుమాన్’ టీమ్ తీసుకున్న నిర్ణయంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Guntur Kaaram Trailer: మహేశ్ ఊర మాస్.. గుంటూరు కారం ట్రైలర్ ఎలా ఉందంటే?

Show comments