Teja Sajja, Kalki 2898 AD: ప్రభాస్‌ కల్కి.. క్రేజీ అప్డేట్‌! హనుమాన్‌ హీరో తేజ సజ్జా కూడా..!

Teja Sajja, Kalki 2898 AD: ప్రభాస్‌ కల్కి.. క్రేజీ అప్డేట్‌! హనుమాన్‌ హీరో తేజ సజ్జా కూడా..!

2024 సంవత్సరానికి గానూ అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించిన హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో యంగ్ హీరో సజ్జా తేజ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ క్రేజ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

2024 సంవత్సరానికి గానూ అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించిన హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో యంగ్ హీరో సజ్జా తేజ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ క్రేజ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

తెలుగు మీడియాని ఒక్క క్షణం పక్కన పెడితే…..ప్రతీ లాంగ్వేజ్ మీడియా తెలుగు యాక్టర్స్ మీద తిరుగులేని ఫోకస్ పెడుతోంది. ముఖ్యంగా మన సినిమాలు, మన స్టార్సు పానిండియా లెవెల్లో హెడ్ లైన్సులోకి వెళ్ళారో…బాలీవుడ్ నటీనటుల మీద కన్నా మన తెలుగు స్టార్స్ పైనే ఇండియన్ మీడియా కన్నేసింది. 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, 2024 సంవత్సరానికి గానూ అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా రికార్డయిన హనుమాన్ సినిమాతో దర్శకనిర్మాతలు ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి…..హీరో తేజా సజ్జా మొత్తం ఇండియన్ మీడియాని డామినేట్ చేసి, ఎప్పడూ వార్తల్లోనే ఉంటున్నారు.

ముఖ్యంగా తేజా సజ్జా. అంత భారీ ఎత్తు హిట్ హీరోగా సంచలనం స్రుష్టించిన తేజ తదుపరి చిత్రం ఏమిటన్నది అందరికీ ఉత్కంఠగానే మారింది. నేచురల్ గానే ఇది అందరినీ ఆలోచింపజేస్తుంది. కానీ ఏ అప్డేట్ ఎక్కడా లేదు. తేజ ఆచితూచి అడుగేస్తున్నాడన్నది అందరికీ అర్ధమవుతోంది. చాలా మంది కాంటాక్ట్ లో ఉన్నారని కూడా తెలుస్తోంది. కానీ తేజ వైపునుంచే ఏ సిగ్నలూ లేదు. ఆల్ రెడీ పీపుల్స్ మీడియా సినిమా ఎప్పుడో ప్రారంభమై ఉంది. దానిని మాత్రం కంటిన్యూ చేస్తాడన్నది క్లియర్. కానీ తర్వాత ఏమిటి? దేనికి సైన్ చేశాడు….ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.

తాజాగా వినిపిస్తున్న వార్తేంటంటే…..ఆరేడు వందల కోట్ల వ్యయంతో ఇండియన్ హెర్క్యులస్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అగ్రనిర్మాత అశ్వనీ దత్ నిర్మిస్తున్న కల్కి సినిమాకి సంబంధించి బోర్డ్ మీదకి రాబోతున్నాడు తేజ సజ్జా అన్నది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇది కూడా బాలీవుడ్ మీడియానే లీక్ చేసింది. ప్రభాస్, దీపికా పడుకోనే, అమితాబ్, కమల్ హసన్ లాంటి టాప్ ర్యాంక్ కేస్టింగ్ మద్యన తేజ సజ్జా కూడా ఉండబోతున్నాడన్నది లేటెస్ట్ గా వినిపిస్తోంది.

పాన్ ఇండియా సినిమాగా అంతులేని ఖర్చుతో తయారవుతున్న కల్కి సినిమాలో ఏ ఒక్క సూపర్ స్టారూ మిస్ కాలేదు. 2024 మే 9న విడుదలకు ముస్తాబవుతున్న కల్కి సినిమాలో మరే క్యారెక్టర్ చేయబోతున్నాడో, అదెంత నిడివి గల పాత్రో ప్రస్తుతానికైతే సస్పెన్సే. కానీ వినడానికి చాలా బావుంది. ఎందుకంటే, వరల్డ్ వైడ్ లాంగ్వేజెస్లో తేజ సజ్జా ఇప్పుడు ఈ చిన్నవయసులోనే అత్యంత పాప్యులారిటీని అందుకున్న హీరోగా రికార్డుకు ఎక్కాడు. ఏ క్యారెక్టర్ చేసినా, అదేదైనా సరే కల్కిలో తేజ బోర్డు మీదకి రావడం మాత్రం తేజకి మరో కలికితురాయి అవుతుందని చెప్పడానికి సందేహం అక్కర్లేదు.

Show comments