Hair Found In Chutney: చట్నీలో వెంట్రుక.. రూ.5వేలు జరిమానా! ఎక్కడంటే..

చట్నీలో వెంట్రుక.. రూ.5వేలు జరిమానా! ఎక్కడంటే..

Hair Found In Chutney: ఈ మధ్యకాలంలో బయట తింటున్న భోజనంలో మేకులు, పురుగులు వంటివి ప్రత్యక్షం అవుతుంటాయి. అలానే ఓ చోట తినే టిఫిన్ లో వెంట్రుక వచ్చింది. దీంతో ఆ షాపు యజమానికి దిమ్మతిరిగే షాకిచ్చారు అధికారులు.

Hair Found In Chutney: ఈ మధ్యకాలంలో బయట తింటున్న భోజనంలో మేకులు, పురుగులు వంటివి ప్రత్యక్షం అవుతుంటాయి. అలానే ఓ చోట తినే టిఫిన్ లో వెంట్రుక వచ్చింది. దీంతో ఆ షాపు యజమానికి దిమ్మతిరిగే షాకిచ్చారు అధికారులు.

ఇటీవలకాలంలో హోటల్ విషయంలో  వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూస్తుంటే బయట ఫుడ్ తిన్నాలంటేనే భయం వేస్తుంది. జనాలు హోటల్ ఫుడ్  అంటేనే భయంతో వణికిపోతున్నారు.  ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి..పలు హోటల్లో నాణ్యతలేని ఫుడ్ సప్లయ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఇది ఇలా ఉంటే.. అప్పుడప్పుడు భోజనం చేసే సమయంలో వినియోగదారులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. తిన్న అన్నంలో మేకు,పురుగులు వంటివి ప్రత్యక్షం అవుతుంటాయి. అలానే ఓ చోట తినే టిఫిన్ లో వెంట్రుక వచ్చింది. దీంతో ఆ షాపు యజమానికి దిమ్మతిరిగే షాకిచ్చారు అధికారులు. ఇక అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…

హైదరాబాద్ నగరంలోని ఏఎస్ రావు నగర్ లోని ఓ ప్రముఖ హోటల్ కి ఉమేష్ కుమార్ అనే వ్యక్తి వెళ్లాడు. ఇటీవలే జూన్ 11వ తేదీన తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్లాడు. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన టిఫిన్లను ఆర్డర్ చశారు. మొత్తం రూ. 522 బిల్‌ అయ్యింది. ఇక బిల్లు సంగతి పక్కన పెడితే..వారు టిఫిన్ చేస్తున్న క్రమంలో షాకి గురయ్యారు. కారణం వారు తింటున్న టిఫిన్ లోని చట్నీలో ఒక వెంట్రుక కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని సదరు రెస్టారెంట్ నిర్వహకులకు తెలియజేశాడు. వారు వెంటనే ఉమేశ్ కి క్షమాపణలు చెప్పి ప్లేట్‌ను మార్చేశాడు.

అయితే తనకు జరిగిన అనుభవాన్ని ఉమేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఈసీఐఎల్ ప్రాంతంలో ఉన్న చట్నీస్ రెస్టారెంట్ లో టిఫిన్ చేస్తున్న సమయంలో తాము తింటున్న చట్నీలో వెంట్రుక కనిపించిందని తెలిపాడు. ఈ విషయాన్ని మేనేజర్‌కి చెప్పగానే ప్లేట్‌ను మార్చేశారని కూడా చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఇది ఒక చేదు అనుభవమంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఉమేశ్ పోస్టు చేసిన ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది. మొత్తంగా ఈ ఘటనపై అధికారులు స్పందించి.. సదరు రెస్టారెంట్ వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. హెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 674 ప్రకారం రెస్టారెంట్‌పై రూ.5 వేల జరిమానా విధించారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.  భోజనంలో  పురుగులు రావడం, బిర్యానిలో బొద్దికలు వచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అంతేకాక  మరికొన్ని సందర్భాల్లో భోజనంలో మేకులు, రాళ్లు కూడా వచ్చాయి. ఇవి చాలవు అన్నట్లు కుళ్లిపోయిన చికెన్, మటన్ లను వడ్డించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతేకాక ఇలాంటి ఘటనలపై ఫుడ్ సేప్టీ అధికారులు కూడా  స్పందించి.. అలాంటి హోటళ్ల, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నారు. భారీ జరిమానాలు విధిస్తూ హోటల్ నిర్వాహకులకు షాకిస్తున్నారు. మరి.. ఇలా ఫుడ్ విషయంలో జరుగుతున్న చేదు అనుభవాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments