Guess This Star Kid: ఈ స్టార్ కిడ్ ని గుర్తు పట్టారా? త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేస్తోంది..!

ఈ స్టార్ కిడ్ ని గుర్తు పట్టారా? త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేస్తోంది..!

Guess This Star Kid: టాలీవుడ్ ఎంతో మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే తమని తాము ప్రూవ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి కూడా తానేంటో ప్రూవ్ చేసుకుని హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

Guess This Star Kid: టాలీవుడ్ ఎంతో మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే తమని తాము ప్రూవ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి కూడా తానేంటో ప్రూవ్ చేసుకుని హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

టాలీవుడ్ చాలా మంది స్టార్లు ఉన్నారు. ఆ స్టార్స్ కిడ్స్ ఉన్నారు. కానీ, ఇండస్ట్రీలో మాత్రం చాలా తక్కువ మంది స్టార్ కిడ్స్ మాత్రమే వారి పేరెంట్ లెగసీని కంటిన్యూ చేయగలుగుతున్నారు. కానీ, స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో అడుగు అయితే పెడతారు. వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ అమ్మడు కూడా ఒక స్టార్ కిడ్. తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవడానికి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఇటీవలే మూవీ పూజ కూడా అయిపోయింది. తన నటతో తల్లికి మంచి పేరు తీసుకురావాలని.. హీరోయిన్ గా రాణించాలని ఉవ్విళ్లూరుతున్న ఆ చిన్నారిని గుర్తు పట్టారా?

చాలా మంది పేరెంట్స్ స్టార్డమ్ ని వాడుకుని సెలబ్రీటీల చలామణి అవ్వాలని చూస్తారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే తమకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకోవాలి అనుకుంటారు. అలాంటి జాబితాలోకి ఈ అమ్మడు పేరును చేర్చేయచ్చు. ఎందుకంటే తన తల్లి గొప్ప నటి అయినప్పటికీ ఆ పేరును వాడుకుని ఇండస్ట్రీలోకి వచ్చేయాలి అని అనుకోలేదు. తనకంటూ కొంత ఫ్యాన్ బేస్, ఒక గుర్తింపు వచ్చిన తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా సోషల్ మీడియాలో ఒక మంచి ఇన్ ఫ్లూఎన్సర్ గా, ఒక మంచి వ్లాగర్ గా తెలుగు ఆడియన్స్ దగ్ర మంచి పేరు సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాకంటే ముందే సెలబ్రిటీ అయిపోయింది. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, ఫొటో షూట్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ చాలానే క్రేజ్ సొంతం చేసుకుంది. ఒక మంచి హీరోయిన్ గా ఎదిగి తల్లిని గర్వపడేలా చేయాలి అని ప్రయత్నాలు చేస్తోంది. బిగ్ బాస్ రన్నరప్ తో మూవీ కూడా అనౌన్స్ చేసింది. త్వరలోనే హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేసి తెలుగు ప్రేక్షకుల ఆదరణ, మన్ననలు పొందాలని ఎదురుచూస్తోంది. ఏంటి.. ఇంకా గుర్తు పట్టలేదా? ఆ అమ్మాయి మరెవరో కాదు.. ప్రముఖ తెలుగు నటి సురేఖా వాణి కుమార్తె సుప్రిత బండారు.

సుప్రీతాకు నెట్టింట ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అమర్ దీప్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అంతకంటే ముందే ఇన్ ఫ్లుఎన్సర్ గా మంచి ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. లైఫ్ లో ఏదీ అంత తేలిగ్గా రాదు అనే ఫిలాసఫీని నమ్మే సుప్రీత.. తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి చాలానే కష్టపడుతోంది. మరోవైపు నెటిజన్స్ కి ఈ తల్లీకూతుళ్ల బాండింగ్ అంటే ఎంతో ఇష్టం. వాళ్లు చేసే అల్లరి, పెట్టే రీల్స్ కు ఫిదా అయిపోతూ ఉంటారు. అలాగే హీరోయిన్ గా సుప్రీత మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు కూడా.

Show comments