OTT Movie: OTTలోకి స్పోర్స్ డ్రామా.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే

OTTలోకి స్పోర్స్ డ్రామా.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే

చిన్న సినిమాలు కూడా మనస్సుకు హత్తుకుపోయే కథ, కథనాలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ముఖ్యంగా గల్లీ క్రికెట్ ఆడే కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే కథ.

చిన్న సినిమాలు కూడా మనస్సుకు హత్తుకుపోయే కథ, కథనాలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ముఖ్యంగా గల్లీ క్రికెట్ ఆడే కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే కథ.

బడా హీరోల మూవీలే కాదు.. చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలయ్యి.. సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ చిత్రాల్లో స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఉండరు. కొత్త వాళ్లే ఉంటారు. ఇందులో కథే కీలక రోల్ పోషిస్తుంది. మనస్సుకు హత్తుకుపోయే కథ, కథనం సినిమాకు బలంగా మారుతున్నాయి. అటువంటి పిక్చర్స్ ఇటీవల కాలంలో విడుదలయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అలా డిఫరెంట్ కాన్సెప్టులతో మూవీస్ తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి చిత్రం థియేటర్లలో రిలీజయ్యి.. ఆలస్యంగా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసింది. ఆ సినిమా ఒక్క రోజులోనే ముగిసిపోయే కథ.

సాధారణంగా ఇటీవల కాలంలో ఓ సినిమా థియేటర్లలో సందడి చేసిందంటే.. నెల రోజుల్లోనే లేదా 45 రోజుల్లోపే ఓటీటీలో సందడి చేసేయాల్సిందే. కానీ ఈ మూవీ  రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి ఆలస్యంగా విడుదలయ్యింది. ఇంతకు ఆ చిత్రమేమిటంటే.. గ్రౌండ్. గ్రౌండ్ మూవీ ఓ స్పోర్ట్స్ డ్రామా. సూరజ్ దర్శకత్వం వహించి, నిర్మించారు. ఇందులో హరినాథ్, తేజస్విని, దుర్గా భవానీ, ప్రీతి, హరినాథ్, నాగరాజు, సుమన్ నటించారు. వీరంతా కొత్త వాళ్లే కావడం గమనార్హం. ఈ చిత్రానికి సంగీతం భాస్కర్ అప్పళ్ల మ్యూజిక్ అందించగా, జహీర్ బాషా సినిమాటోగ్రాఫర్. ఈ ఏడాది ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. 102 నిమిషాల నిడివి గ ల ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మూడు నెలలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కథ విషయానికి వస్తే.. ఆదివారం, సెలవులు వస్తే గ్రౌండ్ లో క్రికెట్ ఆడే టీనేజ్ కుర్రాళ్ల కథ ఇది. హరి, తేజు లవ్ చేసుకుంటారు. హరికి క్రికెట్ ఆడటం అంటే పిచ్చి. ఓ ఆదివారం హరి, అతని స్నేహితుల బృందం క్రికెట్ ఆడటానికి గ్రౌండ్‌కి వెళ్ళినప్పుడు, మరో టీం కుర్రాళ్ళతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ బెట్టింగ్ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు దారి తీస్తుంది. మరీ ఈ బెట్టింగ్ మ్యాచ్‪లో హరి టీం గెలిచిందా. తేజుతో అతని ప్రేమకథపై ఈ మ్యాచ్ ఎలాంటి ప్రభావం చూపిందనేది మిగిలిన కథ. ఇందులో కాస్తంత ఎమోషన్ జోడించి తెరకెక్కించాడు దర్శకుడు.  సినిమా అంతా ఒకటే గ్రౌండ్, ఆ చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ లో తీయడం గమనార్హం. క్రికెట్ మీద చాలా సినిమాలు వచ్చినా ఇది పూర్తిగా భిన్నమైన కథ. ఈ మూవీ చూడకుంటే.. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments