గోపిచంద్ మలినేనికి లక్కీ ఛాన్స్! రవితేజ స్థానంలో ఆ బిగ్ స్టార్!

గోపిచంద్ మలినేనికి లక్కీ ఛాన్స్! రవితేజ స్థానంలో ఆ బిగ్ స్టార్!

సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఏ రూపంలో కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఎన్ని సినిమాలు తీసినా కొంతమంది డైరెక్టర్స్, హీరోహీరోయిన్లకు అసలు కలిసి రాదు. కొంతమంది డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకుంటారు.

సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఏ రూపంలో కలిసి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఎన్ని సినిమాలు తీసినా కొంతమంది డైరెక్టర్స్, హీరోహీరోయిన్లకు అసలు కలిసి రాదు. కొంతమంది డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకుంటారు.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కొన్నిసార్లు సూపర్ హిట్ సినిమాలు చేతులారా చేజార్చుకోవడం, తర్వాత మంచి సినిమా మిస్ అయ్యామని బాధపడటం చూస్తూనే ఉంటాం. మరికొన్నిసార్లు డైరెక్టర్స్ పై ఎంతో నమ్మకంతో సినిమాల్లో నటించి అట్టర్ ఫ్లాప్ అందుకోవడంతో అభిమానుల నుంచి ట్రోల్స్ ఎదుర్కొవడం తెలిసిన విషయమే. సినిమా హిట్ అయితే ఒకే.. ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడిని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. కొన్నిసార్లు తాము అనుకున్న హీరోలు కాకుండా వేరే హీరోలు లైన్ లోకి రావడం లాంటివి అనూహ్యంగా జరిగిపోతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ స్టార్ డైరెక్టర్ విషయంలో అలాంటిదే  జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్.. మొదట అనుకున్న హీరో ఎవరు? కొత్తగా తెరపైకి వచ్చిన స్టార్ హీరో ఎవరు అన్న విషయం గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని. గతంలో గోపిచంద్ మలినేని – మాస్ మహరాజ రవితేజ కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. ఈ క్రమంలోనే రవితేజతో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించి వాయిదా వేసినట్లు ప్రచారం జరిగింది. కాకపోతే దీని గురించి ప్రొడక్షన్ హౌజ్ నుంచి అఫిషియల్ గా ఎలాంటి న్యూస్ రాలేదు. ఇదిలా ఉంటే.. మాస్ మహరాజ స్థానంలో మరో స్టార్ హీరోను తీసుకుబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం రవితేజ బదులు తమిళ స్టార్ హీరో అజిత్ ని తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.

గతంలో మైత్రీ మూవీస్ కి అజిత్ కుమార్ ఓ కమిట్ మెంట్ ఇచ్చారని..  కథ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో మూవీకి కమిట్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. వాస్తవానికి ‘మార్క్ ఆంటోనీ’ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో ఓ మూవీలో అజిత్ కుమార్ నటించబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ.. అనూహ్యంగా గోపిచంద్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కథకు అప్ కమింగ్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో చేస్తే వర్క్ ఔట్ కాదని.. అందుకే అజిత్ లాంటి హీరో కరెక్ట్ గా సెట్ అవుతారని భావించి ఆయనను అప్రోచ్ అయినట్లు ఇన్ సైడ్ టాక్. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తే.. ఈ కథకు సరైన న్యాయం జరుగుతుందని నిర్మాతలు భావించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ మార్కెట్ కలిసోచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. ఈ వార్త నిజమైతే డైరెక్టర్ గోపిచంద్ మలినేని జాక్ పాట్ కొట్టినట్టే. అంతేకాదు అజిత్ కుమార్ దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత డైరెక్ట్ గా తెలుగు లో నటించబోయే చిత్రంగా నిలుస్తుంది. అజిత్ సినీ ప్రస్థానం 30 ఏళ్ల కింద తెలుగులోనే ‘ప్రేమ పుస్తకం’ మూవీతో ప్రస్ధానం మొదలు పెట్టారు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించాడు. కాకపోతే ఈ విషయం గురించి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.

Show comments